రాష్ట్ర ప్రజలందరిపై ఆంజనేయుడి  అనుగ్రహం ఉండాలి

హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు తెలిపిన వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి:  రాష్ట్ర ప్రజలందరిపై ఆంజనేయుడి అనుగ్రహం ఎల్ల‌వేళ‌లా ఉండాల‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆకాంక్షించారు. ఇవాళ హనుమాన్‌ జయంతి సంద‌ర్భంగా వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు భాకాంక్షలు తెలిపారు. ఈ మేర‌కు త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. 

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్‌..
శ్రీరామ భక్తుడైన ఆంజనేయుడు.. ధైర్యం, భక్తి, విశ్వాసం, సేవా తత్వానికి ప్రతిరూపం. రాష్ట్ర ప్రజలందరిపై ఆంజనేయుడి  అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అని ఎక్స్‌ ఖాతాలో వైయ‌స్ జ‌గ‌న్ పోస్ట్‌ చేశారు.
 

Back to Top