కాకినాడ : వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి.. పార్టీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ముద్రగడ.. వైయస్ జగన్‌కి లేఖ రాశారు. ఆ లేఖలో.. ‘ వైయస్ఆర్‌సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమీటీ సభ్యునిగా నియమించడంపై వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి నా కృతజ్ఞతలు. నాపై పెట్టిన భాధ్యతను పార్టీ గెలుపు కోసం త్రికరణ శుద్దితో కష్టపడి పని చేస్తాను. పేదలకు మీరే అక్సిజన్. ఈ ధఫా మీరు అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి పీఠంపై కన్నెత్తి చూడకుండా పదికాలల పాటు పరిపాలన చేయాలి’ అని పేర్కొన్నారు.