అంబేద్కర్ ఆశయాలతో ముందడుగు వేశాం

అంబేద్కర్‌ జయంతి.. వైయ‌స్‌ జగన్‌ నివాళులు 

తాడేపల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ పరిపాలనలో రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలతో ముందడుగు వేశామ‌ని మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి సందర్భంగా ఆయ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ఘ‌న నివాళుల‌ర్పించారు. అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమంటూ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు..

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్‌..
‘రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్, అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు. సమానత్వం, సాధికారతను అందించారు. మన పరిపాలనలో అంబేద్కర్ ఆశయాలతో ముందడుగు వేశాం. రాష్ట్రంలోని అణగారిన వర్గాలకు గౌరవం, న్యాయం అందించడానికి ఎప్పుడూ పని చేస్తాం. అంబేద్కర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం. ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం’ అని అన్నారు. 

Back to Top