సుప్రీం కోర్టులో వైయ‌స్ఆర్‌సీపీ పిటిష‌న్‌

వ‌క్ఫ్ చ‌ట్టాన్ని సుప్రీం కోర్టులో స‌వాల్ చేసిన వైయ‌స్ఆర్‌సీపీ

న్యూఢిల్లీ: వక్ఫ్‌ చట్ట సవరణకు వ్యతిరేకంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది.  వక్ఫ్‌ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమ‌ని, ప్రాథమిక హక్కులను అది ఉల్లంఘిస్తోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ సుప్రీం కోర్టును ఆశ్ర‌యించింది. వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లుకు పార్ల‌మెంట్‌లో వ్య‌తిరేకంగా వైయ‌స్ఆర్‌సీపీ ఓటు వేసిన విష‌యం విధిత‌మే. మైనారిటీ సమాజానికి వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా వక్ఫ్‌ సవరణ బిల్లును ఇటీవ‌ల పార్ల‌మెంట్‌లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్య‌తిరేకించింది.  గ‌తంలోనే వక్ఫ్‌ సవరణ బిల్లుపై వైయ‌స్ఆర్‌సీపీ అభ్యంతరం తెలపడంతో కేంద్ర ప్రభుత్వం జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేసింది. మళ్లీ పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశ పెట్ట‌డంతో లోక్‌స‌భ‌, రాజ్యసభలో వ‌క్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు ఓటేశారు.  ముస్లింలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు...ఇప్పుడు వక్ఫ్ చట్టానికి మద్దతిచ్చి  మరోసారి ముస్లింలను మోసం చేశారు. అన్ని మతాలలాగే ముస్లిం మతాన్ని చూడాలి, వారి  ఆస్తుల  విషయంలో ప్రభుత్వాల  జోక్యం అనవసరం. వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలను అణచివేసే విధంగా ఉంది, ఇదిలాగే కొనసాగితే,  దేశంలో అశాంతి పెరిగే ప్రమాదం ఉంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ త‌న పిటిష‌న్‌లో పేర్కొంది.

Back to Top