పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా బీఆర్ అంబేద్క‌ర్ జ‌యంతి వేడుక‌లు

తాడేపల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా బీఆర్‌ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా అంబేద్కర్ చిత్రపటానికి పార్టీ నాయ‌కులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీజేఆర్ సుధాకర్ బాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్ మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎస్సీ సెల్ నేత కొమ్మూరి కనకారావు, షేక్‌ ఆసిఫ్‌, అంకంరెడ్డి నారాయణమూర్తి, వేల్పుల రవికుమార్‌, ఎన్‌.చంద్రశేఖర్‌ రెడ్డి, దొంతిరెడ్డి వేమారెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


 

 

అంబేద్కర్‌ విగ్రహంతో వ్యాపారం చేయాలనుకోవడం దుర్మార్గం: మాజీ మంత్రి మేరుగ నాగార్జున 
భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహానీయుడు బీఆర్‌ అంబేద్కర్‌, ప్రపంచంలో ఉన్నత దేశాలు కూడా భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాయి, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా భారత రాజ్యాంగాన్ని రచించిన గొప్ప వ్యక్తి. రాజ్యాంగ విలువలను ఏపీలో కాలరాస్తున్నారు. వైయ‌స్‌ జగన్  గొప్ప ఆలోచనలు, ఆశయాలతో పరిపాలిస్తే నేడు వాటికి కూటమి ప్రభుత్వం తూట్లుపొడుస్తుంది. అంబేద్కర్‌ ఆలోచనా విధానాన్ని పాటించి వైయ‌స్ జగన్ పాలించారు. అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ముళ్ళపొదల్లో వేస్తే ..వైయ‌స్ జ‌గ‌న్ విజయవాడ నడిబొడ్డున గొప్పగా ఏర్పాటు చేశారు. ఇవాళ‌ చంద్రబాబు ఆ మహానుభావుడి విగ్రహంతో వ్యాపారం చేస్తున్నారు. చంద్రబాబు నీకెంత ధైర్యం, ఆయన స్మృతివనం అమ్మాలనుకునే నీ పద్దతి, ఆలోచన మార్చుకో, అంబేద్కర్ ని అమ్మకానికి పెట్టి అగౌరవపరిచిన చంద్రబాబు దుర్నీతిని ఎండగడదాం. భావితరాలకు ఆయన స్పూర్తిని అందించి వైయ‌స్ జగన్‌ నాయకత్వం మరోసారి రాష్ట్రానికి అవసరం, ఈ దిశగా మనమంతా అడుగులు వేద్దాం. రానున్న రోజుల్లో వైయ‌స్ జగన్ ను మరోసారి సీఎం పీఠంపై కూర్చోపెట్టి అంబేద్కర్‌ ఆశయాలను కొనసాగిస్తాం.

అంబేద్క‌ర్ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌: ఎమ్మెల్సీ ఎం.అరుణ్‌ కుమార్ 

అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్న నాయకుడు వైయ‌స్ జగన్‌.  ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా బడుగు బలహీనవర్గాల ప్రజలు ఉండాలని ఆయన కోరుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలో పుట్టినరోజు చేసేది జీసస్‌ క్రీస్తు, అంబేద్కర్  వి మాత్రమే, సామాజిక న్యాయం, మహిళా సాధికారత ఇలా బడుగు బలహీనవర్గాల వారంతా ఒక మెట్టు పైన ఉండాలని ఆలోచించింది అంబేద్కర్‌. ఆ తర్వాత మా నాయకుడు వైయ‌స్ జగన్ మాత్రమే, అంబేద్కర్ కి ఘనంగా నివాళులర్పిస్తున్నాం.

 కూట‌మి పాల‌న‌లో అంబేద్క‌ర్ ఆశ‌యాల‌కు తూట్లు:  మాజీ ఎంపీ నందిగం సురేష్ 

అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా గత ఐదేళ్ళుగా వైయ‌స్ జగన్  పాలన చూశాం, ఎక్కడా రాజ్యంగ ఉల్లంఘన జరగకుండా పాలించారు, కానీ కూటమి పాలనలో అంబేద్కర్‌ గారి ఆశయాలకు తూట్లుపొడిచి దళితులు, మైనార్టీలను, బడుగు బలహీన వర్గాలను ఊచకోత కోస్తూ పాలిస్తున్నారు. ఇలాంటి పాలన అవసరంలేదని మనమంతా ఆలోచించి రానున్న రోజుల్లో అంబేద్కర్‌ గారి స్ఫూర్తిని కొనసాగించే జగన్‌ గారిని సీఎం పీఠంపై మరోసారి కూర్చోపెట్టేందుకు మనమంతా కష్టపడాలని కోరుకుంటున్నా.

 చంద్ర‌బాబూ..ఖబడ్దార్‌:  మాజీఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు 

అంబేద్కర్‌ గారి నిలువెత్తు విగ్రహాన్ని మా నాయకుడు జగన్‌ గారు విజయవాడ నడిబొడ్డున గొప్పగా ఏర్పాటుచేశారు. అలాంటి గొప్ప విగ్రహాన్ని, మన అందరి ఆత్మగౌరవాన్ని తాకిన చంద్రబాబుకు మనం బుద్దిచెప్పాలి, పీపీపీ విధానంలో అంబేద్కర్‌ విగ్రహాన్ని తాకే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబుకు ఇదే మా హెచ్చరిక, కబర్ధార్‌ చంద్రబాబు, మేం ప్రాణాలైనా అర్పిస్తాం, పీపీపీ విధానాన్ని అడ్డుకుంటాం, అంబేద్కర్‌ విగ్రహం జోలికి వెళ్ళావో నీకు తగిన గుణపాఠం తప్పదు. 

 వైయ‌స్ జ‌గ‌న్ నాయ‌క‌త్వం మ‌రోసారి అవ‌స‌రం:  ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి 

భారతదేశానికి రాజ్యాంగానికి అందించిన మహానుభావుడు బీఆర్‌ అంబేద్కర్‌, ఆయన రాజ్యాంగ స్పూర్తిని మనం అనుసరించాలి, భూమి, ఆకాశం ఉన్నంత కాలం అంబేద్కర్ చిరస్ధాయిగా ఉంటారు. నాడు వైయ‌స్ రాజశేఖర్‌ రెడ్డి  , ఆ తర్వాత వైయ‌స్ జగన్‌ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళారు. అంబేద్కర్‌ గారి ఆశయాలు, సిద్దాంతాలు ముందుకు తీసుకెళ్ళాలంటే వైయ‌స్ జగన్‌  నాయకత్వం మరోసారి రాష్ట్రానికి అవసరం. మనమంతా ఆ దిశగా అడుగులు వేద్దాం

అంబేద్క‌ర్ స్ఫూర్తిని కొన‌సాగించారు:  మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి 

భారతదేశానికి దశ, దిశ నిర్దేశించిన మహానుభావుడు అంబేద్కర్‌, ఆయన ఆశయాలను, స్పూర్తిని కొనసాగించాలి, మా నాయకుడు జగన్‌ గారు తన పాలనలో అంబేద్కర్‌ స్పూర్తిని కొనసాగించారు, మున్ముందు కూడా అదే విధంగా ముందుకెళదాం

అంబేద్క‌ర్ క‌ల‌లు వైయ‌స్ జ‌గ‌న్ సాకారం:  మాజీ ఎమ్మెల్యే  కైలే అనిల్ 

సమాజంలో అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతికి బాటలు వేసిన మహానుభావుడు అంబేద్కర్‌, ప్రాథమిక హక్కులు ప్రతి ఒక్కరికీ ఉంటాయన్నారు, సమసమాజ స్ధాపనకు ఆయన కన్న కలలను సాకారం చేసింది జగన్. కూటమి ప్రభుత్వ దుర్మార్గపు పాలనను ప్రజలు గమనిస్తున్నారు. తగిన బుద్ది చెప్పే రోజు త్వరలో వస్తుంది.
 

అంబేద్క‌ర్ మార్గం అనుస‌ర‌ణీయం: కొమ్మూరి కనకరావు 

ఈ రోజు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ గారు భారతదేశానికి ముద్దుబిడ్డగా, మనుషులంతా ఒక్కటే అని, స్వేచ్ఛ, సమానత్వం కోసం పాటుపడ్డ మహానుభావుడు, ఆయన రాసిన రాజ్యాంగం మూలాల వల్లే ఇప్పటికీ ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. అంబేద్కర్‌ గారు ఈ సమాజంలో పేదరికం ఉండకూడదన్న ఆశయాన్ని జగన్‌ గారు తన పాలనలో చూపారు. మహిళలకు సమాన హక్కులు కావాలని, అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం కావాలని బీఆర్‌ అంబేద్కర్‌ కృషిచేశారు, జగన్‌ గారు విజయవాడ నడిబొడ్డున భారీ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దేశంలోనే దళితులు తలెత్తుకు తిరిగేలా చేశారు. బీఆర్‌ అంబేద్కర్‌ గారు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ మా పార్టీ ముందుకెళుతుంది.  

Back to Top