బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదంపై మాజీ సీఎం వైయస్ జగన్‌ దిగ్భాంతి

బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

వైయస్‌.జగన్‌ ఆదేశాల మేరకు ఘటనా స్థలానికి వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు 

తాడేప‌ల్లి: అనకాపల్లి జిల్లా కోటవురట్లలో ఒక బాణా సంచా తయారీ కేంద్రంలో ప్రమాద ఘటన పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం, మరికొందరు తీవ్రంగా గాయపడ‌టం తీవ్ర విచారకరమన్నారు. మరణించినవారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాలకు తోడుగా నిలవాలని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులను ఆదేశించారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలు తిరిగి కోలుకునేలా అన్నిరకాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  ఈ ప్రమాదం పార్టీ నాయకుల ద్వారా తెలియగానే వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి, సహాయంగా నిలవాలని వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ నాయకులను వైయస్.జగన్‌ ఆదేశించారు.

Back to Top