టీడీపీ నేతల దాష్టీకం

అనంత‌పురం:  వైయ‌స్ఆర్‌సీపీ సానుభూతిపరుడైన కురుబ చిక్కాల బాలన్నపై టీడీపీ నేతలు అతి కిరాతకంగా కర్ర లతో దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటన బుధవారం రాత్రి రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గం ఆత్మకూరు మండలం సిద్దరాంపురం గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన మేరకు... బుధవారం సాయంత్రం తన పొలంలో పనులు చూసుకుని ఇంటికి వెళుతున్న బాలన్నపై కాపు కాచిన టీడీపీ నేతలు కర్రలతో విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న కురుబలపై దాడి చేయడం ద్వారా వారిలో అభద్రతా భావాన్ని పెంచేందుకు పన్నిన కుట్రలో భాగంగానే ఈ కుట్రకు తెరలేపారు. దాడి అనంతరం కురుబ చిక్కాల బాలన్న ఆత్మకూరుకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడి చేసిన నారాయ ణస్వామి, రమేష్, భరత్ చర్యలు తీసుకోవాలని కోరారు. 

Back to Top