వైయ‌స్ఆర్‌సీపీ నేత ఈసీ మ‌హేశ్వ‌ర‌రెడ్డిపై దాడి

వైయ‌స్ఆర్ జిల్లా:  వైయ‌స్ఆర్ జిల్లాలో టీడీపీ నేత‌లు దౌర్జ‌న్యానికి పాల్ప‌డ్డారు. వైయ‌స్ఆర్‌సీపీ నేత ఈసీ మ‌హేశ్వ‌ర‌రెడ్డిపై టీడీపీ నేత‌లు దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న గురువారం చోటు చేసుకుంది. నీటి సంఘాల ఎన్నిక‌ల నేప‌థ్యంలో త‌హశీల్దార్ కార్యాల‌యంలో ప‌న్ను క‌ట్టేందుకు వెళ్లిన ఈసీ మ‌హేశ్వ‌ర‌రెడ్డిని టీడీపీ నేత‌లు అడ్డుకున్నారు. ఆయ‌న చేతిలోని కాగితాల‌న లాక్కొని చించేసిన టీడీపీ నేత పార్థ‌సార‌ధిరెడ్డి, అత‌ని అనుచ‌రులు. ఈ చ‌ర్య‌ల‌ను వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు తీవ్రంగా ఖండించారు.

Back to Top