గుడివాడ: ఆంధ్రప్రదేశ్‌లో 36,31,216 కార్డుదారులకు రేషన్ డీలర్ల ద్వారా పీఎంజీకేవై కింద ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. గురువారం గుడివాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 1,48,56,590 బియ్యం కార్డులు ఉన్నాయని, ఈ కార్డుల్లోని ఒక్కో కుటుంబ సభ్యుడికి 5 కేజీలు చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బియ్యం కార్డుదారులకు నిత్యావసరాల పంపిణీ సక్రమంగా సాగుతోందన్నారు. కర్నూలు జిల్లాలో 29.16%, ప్రకాశం జిల్లాలో 24.08%, వైఎస్సార్ కడప జిల్లాలో 25.71%, అనంతపురం జిల్లాలో 27.60%, పశ్చిమ గోదావరి జిల్లాలో 24.60%, చిత్తూరు జిల్లాలో 27.92%, గుంటూరు జిల్లాలో 25.50%, విజయనగరం జిల్లాలో 24.15%, శ్రీకాకుళం జిల్లాలో 17.76%, నెల్లూరు జిల్లాలో 17.46% పంపిణీ ప్రక్రియ పూర్తయినట్లు వివరించారు.