పాద‌యాత్ర‌లో ఇచ్చిన మాట ప్ర‌కారం వైయ‌స్ఆర్ బీమా అమ‌లు

బీమా పథకం పూర్తి ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది

5 కోట్ల మంది ప్ర‌జ‌లు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు రుణ‌ప‌డి ఉంటారు

మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం

తాడేప‌ల్లి:  సీఎం వైయస్‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంకల్ప‌యాత్ర‌లో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన మాట ప్ర‌కారం వైయ‌స్ఆర్ బీమా ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నార‌ని మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం పేర్కొన్నారు. బుధ‌వారం సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన వైయ‌స్ఆర్ బీమా ప‌థ‌కం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మంత్రి మాట్లాడారు.  నిరుపేద కుటుంబాలకు జీవన భద్రత కల్పించేందుకు బియ్యం కార్డులున్న కుటుంబాలను ఆపత్కాలంలో ఆదుకునేందుకు ‘వైయ‌స్సార్‌  బీమా’ పథకాన్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభిస్తున్నార‌ని చెప్పారు.  బీమా ప‌థ‌కానికి గ‌తంలో కేంద్ర ప్ర‌భుత్వం స‌హ‌కారం అందించేద‌ని, ఇప్పుడు కేంద్రం త‌ప్పుకోవ‌డంతో వైయ‌స్సార్‌ బీమా పథకం పూర్తి ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంద‌న్నారు. ఈ మేరకు రూ.510 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింద‌ని చెప్పారు. ఈ పథకం ద్వారా 1.41 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంద‌ని, రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్ర‌జ‌లు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు రుణ‌ప‌డి ఉంటార‌ని, ఆ కుటుంబాల త‌ర‌ఫున మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Back to Top