నెల్లూరు: ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌వ్యవహారంపై అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నందున సమయం మాత్రమే కోరారని తెలిపారు. సాక్ష్యాల ఆధారంగా నిమ్మగడ్డ వివరణ తీసుకుంటామన్నారు.ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నిమ్మగడ్డ విచారణకు వస్తారని భావిస్తున్నామన్నారు.