వైయ‌స్ఆర్‌సీపీ ఫ్లెక్సీల చించివేత

చిత్తూరు జిల్లా: వెదురుకుప్పం మండలంలోని గంటావారిపల్లె, జక్కిదొన గ్రామాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఏర్పాటు చేసిన జగనన్న ఫ్లెక్సీలు, బ్యానర్లను శనివారం అర్థరాత్రి చించివేశారు. గత నెలలో మాజీ ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. జన్మదిన వేడుకలను సైతం పండుగలా జరుపుకున్నారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి కృపాలక్ష్మి సైతం వేడుక‌ల్లో పాల్గొన్నారు. గ్రామాల్లో ఎక్కడ జల్లికట్టు జరిగినా ఏ కార్యక్రమమైనా యువతలో పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. దీన్ని చూసి ఓర్వలేక టీడీపీకి చెందిన చోటా నాయకుల సూచనల మేరకే జగనన్న ఫ్లెక్సీలను చించి వేస్తున్నారని పార్టీ నాయకులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Back to Top