కిడ్నాపర్లలా వ్యవహరించిన ప్రకాశం జిల్లా పోలీసులు

ఇంటూరి రవికిరణ్‌పై దురుసు ప్రవర్తన
 

ప్రకాశం జిల్లా: సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవి కిరణ్‌ను ప్రకాశం జిల్లా పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. కోర్టు షరతు మేరకు సంతకం పెట్టేందుకు ప్రకాశం జిల్లా మార్టూరు స్టేషన్‌కు వెళ్లిన ఇంటూరిని.. అక్కడ నుంచి పర్చూరుకు సిఐ తీసుకెళ్లారు. ఇంటూరి రవి కిరణ్.. ఇటీవల బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. కనీసం కేసు వివరాలు కూడా చెప్పకుండా  పర్చూరు పోలీసులు దురుసుగా వ్యవహరించారు.

కిడ్నాపర్లలా వ్యవహరించిన ప్రకాశం జిల్లా పోలీసులు.. తెల్ల కాగితంపై బలవంతంగా సంతకం చేయించుకొని గుర్తు తెలియని ప్రదేశంలో ఇంటూరి రవి కిరణ్‌ను వదిలేశారు. కనీసం ఏ కేసుపై తీసుకొని వెళ్ళారో కూడా చెప్పని సీఐ శేషగిరి రావు.. ఇంటూరిని ఇబ్బంది పెట్టిన అంశంలో ఇదే సీఐకు న్యాయస్థానం షాకాజ్ నోటీసులు ఇచ్చింది. కక్ష సాధింపులో భాగంగా మరో అక్రమ కేసు బనాయించడానికి పోలీసులు కుట్ర పన్నుతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మండిపడుతున్నారు.

Back to Top