విజయవాడ: వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా ప్రతినిధులపై అడ్డగోలు కేసులు పెడుతున్నారు విజయవాడ సైబర్‌క్రైమ్ పోలీసులు. ఏడాదిన్నర క్రితం చనిపోయిన వారిపై కేసు పెట్టి విచారణకు రమ్మని నోటీసు పంపడమే ఇందుకు ఉదాహరణ. తుళ్లూరు మండలం బోరుపాలెంలో ఏడాదిన్నర క్రితం తురక శీను అనే వ్యక్తి చనిపోతే, ఇప్పుడు అతనికి సైబర్ క్రైమ్ విభాగం నోటీసులు పంపింది. విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇక జయోహో జగనన్న వాట్పాస్ గ్రూపులో 87 మందికి పైగా కేసు నమోదు చేశారు. వారిని సైతం విచారణకు రావాలని ఆదేశించింది. ఏపీలో వింత కేసులు ఏపీలోని పోలీసులు వింత కేసులు నమోదు చేస్తున్నారు. వాట్పాప్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకరు పోస్టు పెట్టడంతో గ్రూప్ సభ్యులందరికీ నోటీసులు ఇచ్చారు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు. వైయస్ఆర్ కుటుంబం గ్రూప్‌లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒకరు పోస్టు పెడితే గ్రూప్‌లో ఉన్న 411 మందికి నోటీసులు ఇచ్చారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనే కారణంతో ఏపీతో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నవారికి నోటీసులు ఇచ్చారు.దీంతో తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ సైబర్ క్రైమ్ పీఎస్‌కు వాట్సాప్ గ్రూప్ సభ్యులు తరలి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.