కర్నూలు: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం కర్నూలులో పర్యటించారు. నగరంలోని జీఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నెకల్ సురేంద్ర రెడ్డి కుమార్తె వివాహా రిసెప్షన్‌కు వైయస్ జగన్ హాజరై నూతన వధూవరులు డాక్టర్ కె. చతుర, డాక్టర్ కె. నిఖిల్‌లకు వివాహా శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు. అంతకుముందు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి కర్నూలులో వైయస్ఆర్‌సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. జననేతను చూసేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు పోటెత్తారు. అభిమాన నాయకులు రావడంతో కర్నూలులో పండుగ వాతావరణం నెలకొంది.