తాడేపల్లి: వైయస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ వైయస్ఆర్ జిల్లాకు వెళ్లనున్నారు. బెంగళూరు నుంచి బయలుదేరి వైయస్ జగన్.. మొదట ఇడుపులపాయ చేరుకుంటారు. అనంతరం పులివెందులకు వెళ్తారు. వైయస్ జగన్ మంగళవారం జిల్లాకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి 10.45 గంటల ప్రాంతంలో ఇడుపులపాయ చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పులివెందులకు వెళ్తారు. మూడు రోజుల పాటు పులివెందులలో ప్రజలకు వైయస్ జగన్ అందుబాటులో ఉంటారు.