తాడేపల్లి: మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావును వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్మరించుకున్నారు. గురజాడ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ‘‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్” అన్న దేశభక్తి గీతాన్ని సమాజాన్ని మేల్కొలిపే ‘కన్యాశుల్కం’ నాటకాన్ని తెలుగుజాతికి అందించిన అభ్యుదయ కవితా పితామహుడు, గురజాడ అప్పారావు. ఆయన జయంతి సందర్భంగా హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాను.’’ అంటూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.