హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీతోపాటు అనుబంధ సంఘాలకు బాధ్యులను నియమించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆమోదంతో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఈ జాబితాను విడుదల చేశారు. రాష్ట్ర కమిటీలో ఏడుగురు కార్యదర్శులు, 8 మంది సంయుక్త కార్యదర్శులు, ఇద్దరు కార్యనిర్వహక సభ్యులకు చోటు కల్పించారు. రంగారెడ్డిజిల్లాకు చెందిన జి.ధనలక్ష్మి, బి.రఘోత్తమ్‌రెడ్డి, కుసుమ కుమార్‌రెడ్డి, టి.కుమారయాదవ్, ఎస్‌కే యేసుదాని, సామ యాదిరెడ్డి, జి.వెంకట్‌రెడ్డిలను కార్యదర్శులుగా నియమించారు. మెదక్ జిల్లాకు చెందిన కె.బాలకృష్ణారెడ్డి, ఆర్.చంద్రశేఖర్, కరీంనగర్‌కు చెందిన సెగ్గెం రాజేశ్, రంగారెడ్డి జిల్లాకు చెందిన డి.గోపాల్ రెడ్డి, సి.అరుణారెడ్డి, రమా ఓబుల్‌రెడ్డి, జె.వరలక్ష్మి, బసిరెడ్డి బ్రహ్మానందరెడ్డిలను జాయింట్ సెక్రెటరీలుగా నియమించారు. వీరితోపాటు హైదరాబాద్‌కు చెందిన కసిరెడ్డి ఉపేంద్రరెడ్డి, బ్రహ్మయ్యలను ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా నియమించారు.