ప్రజల మనిషినని నిరూపించుకున్న జగన్

హైదరాబాద్ 25 సెప్టెంబర్ 2013:

తాను ఎప్పటికీ ప్రజల మనిషినని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్  జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఉవ్వెత్తున ఉద్యమిస్తున్న ప్రజలతో తానుండాలని సీబీఐ కోర్టుకు దాఖలు చేసిన బెయిలు పిటిషనులో శ్రీ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారంటూ డెక్కన్ క్రానికల్ పత్రిక కథనం. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారి వెంట ఉండాలనుకుంటున్నాను. బెయిలు కోసం నా అభ్యర్థన వెనుక ఇది కూడా ఒక కారణమని బెయిలు పిటిషనులో వివరించినట్లు తెలిపింది. ఈ కీలక సమయంలో తాను పార్టీకి నాయకత్వం వహించాల్సిన అవసరం కూడా ఉందని శ్రీ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు విజ్ఞప్తి చేసినట్లు ఆ కథనం వివరించింది.

Back to Top