అక్కసుతో చంద్రబాబు గోబెల్సు ప్రచారం

హైదరాబాద్, 11 సెప్టెంబర్ 2013:

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్‌ ఓ చవటబ్బాయి అని  వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ సీఎల్పీ కో-ఆర్డినేటర్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.‌ వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి జననేతగా ప్రజల్లో వచ్చిన ఆదరణ తన కొడుక్కి రాలేదనే అక్కసు, ఆందోళనతోనే చంద్రబాబు గోబెల్సు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

లోకేష్ లీలలు టిడిపి ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ‌ నాయుడికి బాగా తెలుసని శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. చంద్రబాబు గోబెల్సు ప్రచారం మానుకోవాలని సలహా ఇచ్చారు. లేకపోతే లోకేష్ లీలలు బయటపెడతామని హెచ్చరించారు. సీమాంధ్రలో చంద్రబాబు చేసేది ఆత్మగౌరవ యాత్ర కాదని, మహానేత డాక్టర్ వై‌యస్ఆర్‌ పైన‌, వైయస్ఆర్ ‌కాంగ్రెస్‌ పార్టీపై‌న చేస్తున్న విష ప్రచార యాత్ర అన్నారు. చంద్రబాబు గోబెల్సు ప్రచారం చేసే ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించి అధికారాన్ని చేజిక్కించుకున్నారని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. గోబెల్సు ప్రచారం చేయడంలో చంద్రబాబు, ఆయన కోటరీ దిట్ట అని అన్నారు. 2009 ముందు వైయస్ఆర్పై గోబె‌ల్సు ప్రచారం చేసినా విజ్ఞులైన రాష్ట్ర ప్రజలు చంద్రబాబును నమ్మలేదని, మరోసారి మహానేత వైయస్‌ఆర్‌కే పట్టం కట్టారని ఆయన గుర్తుచేశారు.

టిడిపి అధికారంలోకి రావడం చారిత్రక అవసరం అని చంద్రబాబు చెప్పుకుంటున్నారని... కానీ ఆ పార్టీకి ఓటు వేయడం చారిత్రక తప్పిదం అని భావిస్తున్నారన్న విషయం గ్రహించాలని శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. నేర చరితుల్లో టిడిపిదే అగ్రస్థానం అని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్సు అనే సంస్త వెల్లడించిన విషయం వాస్తవం కాదా? చంద్రబాబూ అని ఆయన గుర్తుచేశారు. టిడిపికి చెందిన 28 మంది ఎమ్మెల్యేలపై మార్చి నెల వరకూ ఉన్న కేసుల వివరాలను శ్రీకాంత్‌రెడ్డి ప్రస్తావించారు. ఛీటింగ్‌ కేసులో ఇటీవలే అరెస్టయిన సాయిబాబు చంద్రబాబుకు, ఆయన రాజగురువుకు, ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌కు అకౌంటెంట్‌గా ఉన్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

దొంగలు, క్రిమినల్సును తన పక్కన పెట్టుకుని.. ఎన్నికల్లో వారికి టిక్కెట్లు ఇచ్చిన చంద్రబాబుకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేయడం చూస్తే.. దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్లుందని శ్రీకాంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అద్దాల మేడలో ఉండి ఇతరుల ఇంటిపై రాళ్ళు వేయాలనుకుంటే తన ఇల్లే కూలిపోతుందనే వాస్తవాన్ని చంద్రబాబు గ్రహించాలని ఆయన హితవు పలికారు.

Back to Top