రైతన్నను అప్పుల ఊబిలోకి నెట్టిన బాబు

హైదరాబాద్ః అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ను బాబు  కరువు పీడిత ఆంధ్రప్రదేశ్ గా మార్చారని వైయస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి మండిపడ్డారు. ఏపీలో వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. కరువుతో రాష్ట్రం అల్లాడుతంటే రెయిన్ గన్ లతో కరువును జయించానంటూ బాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. రుణాలు మాఫీ చేయకపోగా,  రైతులకు రుణాలివ్వొద్దంటూ బాబు బ్యాంకులను ఆదేశించడం దారుణమన్నారు. చంద్రబాబు రైతులను పూర్తిగా అప్పుల్లోకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

Back to Top