న‌వ‌ర‌త్నాల‌పై న‌మ్మ‌కం



- వైయ‌స్ జ‌గ‌న్‌పై అన్ని వ‌ర్గాల విశ్వాసం 
- మ‌ళ్లీ రాజ‌న్న రాజ్యం తీసుకురావాల‌ని ప్ర‌జ‌ల ఆకాంక్ష‌
- వైయ‌స్ జ‌గ‌న్ సీఎం కావాల‌ని నిన‌దిస్తున్న రాష్ట్ర ప్ర‌జ‌లు
హైద‌రాబాద్‌: త‌్వ‌ర‌లోనే మంచి రోజులు రాబోతున్నాయ‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే  సాధ్య‌మ‌ని ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాల్లాంటి సంక్షేమ ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌లు న‌మ్మ‌కం పెట్టుకున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నిక‌లు వ‌స్తాయా?, దుర్మార్గ‌మైన టీడీపీ ప్ర‌భుత్వాన్ని ఎప్పుడు  ఇంటికి పంపుదామా?  వైయ‌స్ జ‌గ‌న్‌ను ఎప్పుడు ముఖ్య‌మంత్రిని చేద్దామా అని ప్ర‌జ‌లు ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. టీడీపీ నాలుగేళ్ల దుష్ట ప‌రిపాల‌న‌పై రాష్ట్రంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు తీవ్ర అస‌హ‌నంతో ఉన్నారు. ఇందుకు ప్ర‌త్య‌క్ష సాక్షం ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి వ‌స్తున్న స‌మ‌స్య‌లే. గ‌తేడాది న‌వంబ‌ర్ 6వ తేదీన వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపుల‌పాయ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరుతో పాద‌యాత్ర నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే వైయ‌స్ఆర్ జిల్లా, క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర చేసి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. ప్ర‌స్తుతం చిత్తూరు జిల్లాలో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర సాగుతోంది. దారిపొడువునా ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను వైయ‌స్ జ‌గ‌న్ దృష్టికి తీసుకెళ్ల‌డంతో వారికి జ‌న‌నేత న‌వ‌ర‌త్నాల ద్వారా భ‌రోసా క‌ల్పిస్తున్నారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లు, వివిధ స‌ద‌స్సులో న‌వ‌ర‌త్నాల‌పై ప్ర‌జ‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. రాజ‌న్న బిడ్డ చెబుతున్న హామీల‌పై అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు న‌మ్మ‌కం పెట్టుకుంటున్నారు. 

గుండె గుండెలో వైయస్ఆర్ స్ఫూర్తి
దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టి ప్ర‌జ‌ల హృద‌యాల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నారు. మ‌హానేత భౌతికంగా లేక‌పోయినా ప్ర‌తి గ‌డ‌ప‌లో వైయ‌స్ఆర్ ఫొటోను ఏర్పాటు చేసుకొని దైవంలా భావిస్తున్నారు. ప్ర‌తి ఊర్లో మ‌హానేత విగ్ర‌హాలు ఏర్పాటు చేసుకున్నారు. గుండె గుండెలో వైయస్ఆర్ స్ఫూర్తి ఉంది. అదే ఆదరణ, అదే ఆత్మీయ‌త‌ను రాజ‌న్న బిడ్డ వైయ‌స్ జ‌గ‌న్‌పై ప్ర‌జ‌లు చూపుతున్నారు.  ప్ర‌జ‌లు త‌న‌పై పెట్టుకున్న ఆశ‌ల‌ను వ‌మ్ము చేయ‌కుండా  నీ నా అనే బేధం లేకుండా అందరికీ ప్రయోజనాలందిచే లక్ష్యంతో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  నవరత్నాలు వంటి ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న చేశారు.  వైయస్సార్ ను గుర్తుకు తెచ్చేలా రేపటి ప్రభుత్వం ఉంటుందని చెప్పే వైయస్ జగన్ మాటల్లో భవిష్యత్ పై అంతులేని ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. రాజన్న రాజ్యం రావడం తధ్యం అనిపిస్తుంది. 
 
ఇదిగో నవరత్నాలు  
1. వైయస్ఆర్ రైతు భరోసా :
 క‌రువు, కాట‌కాల‌తో అల్లాడుతున్న రైతుల‌ను ఆదుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ్య‌వ‌సాయానికి పెద్ద పీట వేశారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే వైయ‌స్ఆర్‌ భరోసా పేరుతో రైతుల‌కు పెట్టుబ‌డుల‌కు ప్ర‌తి ఏటా మే, జూన్ మాసంలో రూ.12,500 ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇలా ప్ర‌తి  రైతులకి రూ. 50 వేలు ఇవ్వ‌నున్నారు. మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించేందుకు రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ, రూ. 4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయక నిధి, ప్ర‌తి మండ‌ల కేంద్రంలో కోల్డు స్టోరేజీ ఏర్పాటు. రైతుల‌కు ఉచిత విద్యుత్ వంటి ప‌థ‌కాల‌తో మేలు చేయ‌నున్నారు. 

2 . వైయస్ఆర్‌ ఆసరా:  
డ్వాక్రా సంఘాల పునరుద్ధరణ కోసం వైయ‌స్ఆర్ ఆస‌రా ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించారు.  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తుంది. నాలుగు దఫాలుగా ఈ పథ‌కం ఆడపడుచుల చేతికే ఇస్తుంది. దీంతో పాటుగా వడ్డీలేని రుణాలు అంద చేసి  ఆడపడుచుల‌కు నాటి మ‌హానేత పాలనలో మాదిరి అండగా ఉంటుంది.  

 
3. పింఛన్లు పెంపు: 
ప్రతి అవ్వా తాతలకు, వితంతువుల‌కు, దివ్యంగులకి ప్రస్తుతం అందుతున్న ఫించన్ రూ. 1000 నుంచి రూ. 2000 పెంచడ‌మే కాకుండా వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే పింఛ‌న్ వ‌య‌సు 45 ఏళ్ల‌కే త‌గ్గించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల‌కు అండ‌గా నిలువ‌నున్నారు.  

4. అమ్మ ఒడి:
పేద ఇంట్లోని ఏ తల్లి కూడా తన బిడ్డల చదువు కోసం బాధ పడకూడదు. ఇబ్బంది పడకూడదు. చిన్న బిడ్డ‌ల‌కు బ‌డికి పంపినందుకు ప్ర‌తి త‌ల్లి ఖాతాలో రూ.15 వేలు జ‌మా చేసి వారి పిల్ల‌ల ఉజ్వ‌ల భ‌విష్య‌త్తుకు పునాది.  

5. పేదలందరికీ ఇళ్లు:
కుల, మత , ప్రాంత , పార్టీలకి అతీతంగా ప్రతి పేదవాడికి  ఇల్లు కట్టించే బాధ్యత వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జననేత తీసుకుంటారు. గ‌తంలో దివంగ‌త ముఖ్య‌మంత్రి కేంద్రంతో పోటీ ప‌డి 48 ల‌క్ష‌ల ప‌క్కా ఇల్లు క‌ట్టించారు. ఆ మాదిరిగానే వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వ‌చ్చాక అర్హులంద‌రికి ప‌క్కా ఇల్లు క‌ట్టించ‌డ‌మే కాకుండా ఆ ఇంటిని ఆడ‌ప‌డుచు పేరుతో రిజిస్ట్రేష‌న్ చేయించి ఇచ్చి, ఆ ఇంటి ద్వారా బ్యాంకు రుణం పొందే వీలు క‌ల్పించ‌డమే ఈ ప‌థ‌కం ల‌క్ష్యం. 

6 .ఆరోగ్య శ్రీకి పూర్వ వైభవం:
ఆరోగ్యశ్రీ ఆ దివంగత ప్రియతమ నేత రాజశేఖర్‌రెడ్డిది. ఇంట్లో సంపాదించే వ్యక్తి జబ్బుపడితే ఆ కుటుంబం పడే బాధ చూసి తాను అధికారంలోకి రాగానే ఆ పథ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టి అద్భుతంగా అమ‌లు చేశారు. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చాక ఈ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వ‌చ్చాక ఆరోగ్య‌శ్రీ‌కి పూర్వ వైభవం తీసుకురావ‌డంతో పాటు, ఎంత పెద్ద ఆప‌రేష‌న్ అయినా ఉచితంగా చేయించ‌డం, రూ.1000 బిల్లు దాటితే ఆరోగ్య‌శ్రీ వ‌ర్తించేలా మార్పు చేస్తారు. ఆప‌రేష‌న్ చేయించుకున్న వ్య‌క్తి విశ్రాంతి తీసుకునే స‌మ‌యంలో డ‌బ్బులు కూడా చెల్లించే ఏర్పాటు.  దీర్ఘ‌కాలిక వ్యాధిగ్ర‌స్తుల‌కు నెల‌కు రూ.10 వేల పింఛ‌న్ ఇవ్వ‌డం. 

7. ఫీజు రీయింబర్స్‌మెంటు
డబ్బులేక  ఇంట్లోని బిడ్డ చదువుకి దూరం కాకూడదు అని ఆ దివంగత ప్రియతమ నేత వైయ‌స్ రాజశేఖరెడ్డి అభిలాష‌. ఆ ఆలోచనలోనించి వచ్చిన పథ‌కం నాటి ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కం. ఈ ప‌థ‌కాన్ని చంద్ర‌బాబు నిర్వీర్యం చేశారు. ప్ర‌స్తుతం ఇంజినీరింగ్‌, మెడిసిన్ ఫీజులు ల‌క్ష‌ల్లో ఉన్నాయి. ప్ర‌భుత్వం మాత్రం కేవ‌లం రూ.30 నుంచి రూ.35 వేలు మాత్ర‌మే ఇస్తుంది. మిగ‌తా డ‌బ్బులు చెల్లించేందుకు పేద‌వారు అప్పుల‌పాలు అవుతున్నారు. ఈ ప‌రిస్థితిని మార్చేందుకు వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే పేద‌లంద‌రికీ మొత్తం ఫీజులు ప్ర‌భుత్వ‌మే చెల్లించే ఏర్పాటు. హాస్ట‌ల్ ఖ‌ర్చుల‌కు ప్ర‌తి ఏటా రూ.20 వేలు చెల్లించ‌డం ద్వారా పేద‌ల‌ను ఉన్న‌త చ‌దువులు చ‌దివించేందుకు వైయ‌స్ జ‌గ‌న్ ముందుకు వ‌చ్చారు.  

8 .జలయజ్ఞం:
పుస్తకాల్లో చదువుకున్న భగీరధుని మరిపించారు ప్రియతమ నేత వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి.  రైతే రాజు అన్న మాట నిజం చెయ్యటానికి నాటి భగీరథుని మాదిరే జలయజ్ఞం చేశారు. దశాబ్దాలుగా పునాది రాయికి కూడా నోచుకోని ఎన్నో ప్రాజెక్టులు పరుగులు పెట్టించి రైతు నోటా కరువు మాట వినిపించకూడదు, అని పని చేశారు. నాటి ఆ రాజశేఖరుని ప్రయత్నాల్ని అయన కలలు క‌న్న ప్రతి ప్రాజెక్టుని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పూర్తి చేస్తుంది. “వ్యవసాయం అంటే పండగ” అనే మాట ఆంధ్ర ప్రదేశ్ అంతటా ప్రతిధ్వనించేలా చేస్తుంది రానున్న జననేత పాలనలో ప్రాజెక్టుల‌ను యుద్ధ‌ప్రాతిపాదిక‌న పూర్తి చేసి బీడు భూముల‌ను స‌స్య‌శ్యామ‌లం చేయ‌డ‌మే వైయ‌స్ జ‌గ‌న్ ల‌క్ష్యం.

9 . మధ్య నిషేధం: 
జీవితాలని చిదిమేస్తున్న మధ్యరాకాసిని వైయ‌స్ఆ ర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అదుపులోకి తెస్తుంది. మూడు దశలలో మద్యాన్ని నిషేదిస్తారు. 2024 ఎన్నిక‌ల స‌మ‌యానికి మ‌ద్యాన్ని నిషేదించి ఎన్నిక‌ల్లో ఓట్లు అడుగుతామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించారు. జ‌న‌నేత మాట‌ల‌ను అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు న‌మ్ముతున్నారు. ఎంత త్వ‌ర‌గా వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వ‌స్తే అంత మేలు అని ప్ర‌జ‌లు భావిస్తున్నారు.
Back to Top