పక్షపాతం స‌రికాదు

పులివెందుల ప‌ర్య‌ట‌న‌లో వైఎస్ జ‌గ‌న్ స్థానికుల‌తో మ‌మేకం అయ్యారు. క్యాంపు కార్యాలయంలో పార్టీ కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ఆయ‌న్ని క‌లిశారు. తొండూరు మండలానికి చెందిన వైఎస్‌ఆర్ సీపీ నేతలు తుమ్మలపల్లె శ్రీనివాసులరెడ్డి, బండి రామమునిరెడ్డి, రవికుమార్‌రెడ్డి, దశరథరామిరెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, పాలూరు వేణుగోపాల్‌రెడ్డి తదితరులు.. మండలంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైఎస్ జగన్‌కు వివరించారు.  అగడూరులోని రేషన్ షాపును తీసేయించాలని టీడీపీ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి చివరకు విజిలెన్స్ అధికారుల ద్వారా దాడులు చేయించారని తెలియజేశారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ఒత్తిడికి తలొగ్గి అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తే ఊరుకునేది లేదని, పక్షపాత వైఖరిపై ప్రతిఘటిస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరవాలని.. న్యాయబద్ధంగా వ్యవహరిస్తే బాగుంటుందని హెచ్చరించారు. ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే న్యాయ పోరాటం చేస్తామన్నారు.

Back to Top