గన్నవరం చేరుకున్న వైఎస్ జగన్

గన్నవరం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఉదయం కృష్ణాజిల్లా గన్నవరం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నేతలు ఘన స్వాగతం పలికారు. పెడన మండలంలో జరిగే వైఎస్ఆర్ సీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఉప్పాల (రమేష్)రాము వివాహ రిసెప్షన్కు వైఎస్ జగన్ హాజరు అవుతారు. 

ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వైఎస్ జగన్ అక్కడ నుంచి నేరుగా పెడన మండలానికి రోడ్డు మార్గంలో బయల్దేరారు. కూడురు గ్రామపంచాయతీ శివారులోని కృష్ణాపురం చేరుకుని అక్కడ పార్టీ కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రామ్ప్రసాద్ కుమారుడు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పాల రమేష్ వివాహ రిసెప్షన్లో పాల్గొంటారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించి తిరిగి అక్కడ నుంచి రోడ్డు మార్గాన మధ్యాహ్నం 12.30 గంటలకు గన్నవరం చేరుకుంటారు. అక్కడ నుంచి హైదరాబాద్ వెళతారు.
Back to Top