చింతలపూడి) పశ్చిమగోదావరి జిల్లా లో వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి బొడ్డు వెంకటేశ్వరరావు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన చింతలపూడి పోలీసు స్టేషన్‌లో పోలీసుల నిర్బంధంలో ఉన్నారు బొడ్డు వెంకటేశ్వరరావుతోపాటు మరో ఇద్దరు కాపు సంఘం నాయకులను శనివారం ఉదయం ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఉదయం నుంచి స్టేషన్‌లోనే ఆహారం లేకుండా ఉండిపోవడంతో సాయంత్రం సమయంలో బొడ్డు వెంకటేశ్వరరావు సొమ్మసిల్లి పడిపోయారు. ఆయన్ను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి మెరుగు కాకుంటే ఏలూరు లేదా విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించనున్నట్టు సమాచారం.