హామీల అమలులో ముఖ్యమంత్రి ఘోర వైఫల్యం

కర్నూలు))రేషన్ కార్డు మంజూరు కాలేదని, వీధిలైట్లు వెలగడం లేదని, డ్రైనేజీలు శుభ్రం చేయడం లేదని కర్నూలు నగర ప్రజలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లారు. 8వ వార్డులో హఫీజ్ ఖాన్ గడపగడపలో పర్యటించారు. డాక్టర్ గఫార్ వీధిలో ఇంటింటికీ వెళ్లి ప్రజాబ్యాలెట్ ను అందజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలులో ముఖ్యమంత్రి వైఫల్యాలను హఫీజ్ ఖాన్ ప్రజలకు వివరించారు. ప్రజా ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రజలకు హఫీజ్ ఖాన్ హామీ ఇచ్చారు. 

Back to Top