కార్య‌క‌ర్త‌లే వైయ‌స్ఆర్‌సీపీ బ‌లం

జమ్ములమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి

2014లో 23 మంది ఎమ్మెల్యేల‌ను లాక్కుంటేనే వైఎస్సార్‌సీపీ వెనకడుగు వేయలేదు 

వైయ‌స్ఆర్‌సీపీ అంటే ప్రాణాలిచ్చే కార్య‌కర్త‌లు ల‌క్ష‌ల్లో ఉన్నారు

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, మాజీ ఎమ్మెల్యే రాచ‌మల్లు శివ‌ప్ర‌సాద‌రెడ్డి

ప్రొద్దుటూరు: జమ్ములమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. గ్రామ‌గ్రామాన వైయ‌స్ఆర్‌సీపీ కోసం ప్రాణాలిచ్చే కార్య‌క‌ర్త‌లు ఉన్నంత కాలం తమ పార్టీకి ఏమీ కాద‌ని ఆయన స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం ప్రొద్దుటూరులోని త‌న క్యాంపు కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఆదినారాయ‌ణ‌రెడ్డి లాంటి వారు వైయ‌స్ జగన్‌ను మోసం చేసి వెళ్లినందుకు ఐదేళ్లు రాజ‌కీయంగా దూరం కావాల్సి వ‌చ్చింద‌ని, ఇలా చేసేవారందరికీ భ‌విష్య‌త్తులో ఇదే గ‌తిపడుతుంద‌ని రాచ‌మ‌ల్లు హెచ్చరించారు. సాయిరెడ్డి వెళ్ల‌డంతోనే వైయ‌స్ జ‌గ‌న్ విశ్వ‌సనీయ‌త దెబ్బ‌తిన్న‌ద‌ని విమ‌ర్శిస్తున్న ష‌ర్మిల‌కు మా పార్టీలో ఉన్న ల‌క్ష‌లాది మంది కార్య‌క‌ర్త‌లు క‌నిపించ లేదా అని ప్ర‌శ్నించారు.  

రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి ఏమ‌న్నారంటే..

  • విజ‌య‌సాయిరెడ్డి రాజీనామాతో ఇక వైయ‌స్ఆర్‌సీపీ ప‌ని అయిపోయింద‌ని కూట‌మి నాయ‌కులు ఎవ‌రికి తోచిన‌ట్టు వారు మాట్లాడుతున్నారు. పీసీసీ చీఫ్ షర్మిల కూడా వైయ‌స్ జ‌గ‌న్ విశ్వ‌స‌నీయత కోల్పోయారని చెబుతున్నారు. వారంద‌రికీ నేను స‌మాధానం చెప్ప‌ద‌లుచుకున్నాను. 
  • వైయ‌స్ జ‌గ‌న్, వైయ‌స్ఆర్‌సీపీ ద్వారా అత్యున్న‌త ప‌ద‌వులు అనుభ‌వించి.. పార్టీ అధికారం కోల్పోయి క‌ష్ట‌కాలంలో ఉండగా కొంతమంది వ‌దిలేసిపోయారు. వారు స్వార్థంతో వ్య‌క్తిగ‌త ప్రయోజ‌నాలు ఆశించి వెళ్తున్నారని, వైయ‌స్ జ‌గ‌న్ కి ద్రోహం చేస్తున్నార‌ని ప్ర‌జ‌లే అంటున్నారు. ఎందుకు వ‌దిలిపెట్టిపోవాల్సి వ‌చ్చిందో వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం, ఇది పార్టీకి, జగన్‌ కు చేసిన ద్రోహంగానే ప్రజలు పరిగణిస్తున్నారు.
  • టీడీపీ నాయ‌కులు, ష‌ర్మిల‌కు, ఆదినారాయ‌ణ‌రెడ్డికి అంద‌రికీ చెబుతున్నా.. కొంతమంది నాయకులు రాజీనామా చేసి వెళ్లిపోయినంత మాత్రాన వైయ‌స్ఆర్‌సీపీ ప‌ని అయిపోతుందా..?  వైయ‌స్ జ‌గ‌న్ కోసం ఊపిరి ఉన్నంత వ‌ర‌కే కాదు.. మ‌ళ్లీ ఇంకో జ‌న్మ ఎత్త‌యినా స‌రే ఆయ‌న‌ నాయ‌క‌త్వాన్ని బ‌ల‌ప‌ర‌చాల‌ని కోరుకునే కార్య‌క‌ర్త‌లు నాతోపాటు ఊరూరా ల‌క్ష‌ల్లో ఉన్నారు. వారే మా పార్టీకి బ‌లం. 
  • వైయ‌స్ జ‌గ‌న్‌ని విమ‌ర్శించేవారంతా ఆయ‌న పేరు వింటేనే ప‌క్క త‌డుపుకునే వాళ్లు. వాళ్ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ మీద మ‌న‌సు నిండా కుట్ర‌, ఒళ్లంతా అసూయ.  వైయ‌స్ జ‌గ‌న్ చ‌చ్చిపోలేదు.. కేవ‌లం ఓడిపోయాడ‌ని ప్ర‌స్తుత స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు అన్న మాటలే దీనికి సాక్ష్యం. అంత భ‌యం ఉంది కాబ‌ట్టే ఇంత‌గా కూట‌మి నాయ‌కులు శ‌త్రువు గురించి భయపడుతున్నారు.   

వైయ‌స్ఆర్‌సీపీ మరింత ఉత్సాహంగా ప్రజల్లోకి త్వరలోనే...

  • వైయ‌స్ జ‌గ‌న్ కి మేమెప్పుడూ బ‌లం కాదు.. ఆయ‌నే మా అంద‌రికీ బ‌లం. పోరాటం, ధైర్యం, విశ్వ‌స‌నీయత ఆయ‌న బ‌లం. ఆయన వ్య‌క్తిత్వం, ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌కున్న మంచి పేరే ఆయ‌న‌కు శ్రీరామ‌ర‌క్ష‌. కార్య‌క‌ర్త‌లే జ‌గ‌న్ బ‌లం. కార్య‌క‌ర్త‌లు ఉన్నంతకాలం ఆయన్ను ఏం చేయలేరు. త్వ‌ర‌లోనే ఆయ‌న మ‌ళ్లీ పార్టీని అధికారంలోకి తెస్తారు. 
  • 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన‌ప్పుడు రాజ్య‌స‌భ స‌భ్యులు సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేశ్‌, వంటి వారు పార్టీ మార‌లేదా..?  విశ్వ‌స‌నీయ‌త, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌ట్ల‌ చిత్త‌శుద్ధి లేని అలాంటి చంద్ర‌బాబే 2024 మ‌ళ్లీ సీఎం కాలేదా..? అలాంటిది వైయ‌స్ జ‌గ‌న్ సీఎం కాలేరా..? ఆయ‌న మళ్లీ సీఎం కావ‌డం త‌థ్య‌మ‌ని తెలుసు కాబ‌ట్టే శ‌త్రువులంతా భ‌యంతో వ‌ణికిపోతున్నారు..
  • ఇద్దరు ముగ్గురు  వ‌దిలేసి వెళ్లినంత మాత్రాన జ‌గ‌న్ భ‌య‌ప‌డేవారే అయితే 2014లో 23 ఎమ్మెల్యేల‌ను టీడీపీ కొనుగోలు చేసిన‌ప్పుడే మా పార్టీ క‌నుమ‌రుగ‌య్యేది. ఆరోజే ఆయ‌న ఏమాత్రం అధైర్య‌ప‌డ‌లేదు. 
  • వైయ‌స్ జ‌గ‌న్ ను కాద‌ని వెళ్లిపోయిన  ఆదినారాయ‌ణ రెడ్డి మ‌ళ్లీ గెలవ‌లేదు. ఇప్ప‌టికే 2019-24 మ‌ధ్య ఒక‌సారి విశ్రాంతి తీసుకున్న ఆదినారాయ‌ణ‌రెడ్డి.. మ‌రోసారి అందుకు సిద్ధంగా ఉండాలి. ఆయన నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. 
  • కార్య‌క‌ర్త‌లెవ‌రూ అధైర్య ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. జగన్‌ను న‌మ్మిన కార్య‌కర్త‌ల‌కు, నాయ‌కుల‌కు త్వ‌ర‌లోనే మ‌ళ్లీ మంచి రోజులు వ‌స్తాయి. వైయ‌స్ఆర్‌సీపీ మరింత ఉత్సాహంగా ప్రజల్లోకి వస్తుంది.
Back to Top