చెప్పాడంటే..చేస్తాడంతే

కోవిడ్ సంక్షోభంలో రాష్ట్ర ఆదాయం త‌గ్గినా..ఆగ‌ని సంక్షేమం

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌న్నీ అమ‌లు చేసిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్  

33 నెలల పాలనలో ప్ర‌జ‌ల‌కు వేల కోట్లు ల‌బ్ధి

ల‌క్ష‌లాది కుటంబాల్లో వెలుగులు

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 33 నెల‌ల పాల‌న‌పై అగ్రి మిష‌న్ వైస్ చైర్మ‌న్ ఎంవీఎస్ నాగిరెడ్డి ప్ర‌త్యేక క‌థ‌నం

అమ‌రావ‌తి:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ద్వారా ప్ర‌జ‌ల క‌ష్టాలు క‌ళ్లారా చూశారు.  ఇచ్చిన హామీల‌న్నీ అమ‌లు చేస్తాన‌ని ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ప్ర‌క‌టించారు. ఇచ్చిన హామీ మేర‌కు ఎన్ని క‌ష్టాలు, న‌ష్టాలు ఎదురైనా మాట త‌ప్ప‌కుండా అమ‌లు చేసి చూపారు. కోవిడ్ వంటి క‌ష్ట‌కాలంలో రాష్ట్ర ఆదాయం గ‌ణ‌నీయంగా త‌గ్గినా..హామీలు అమ‌లు చేయ‌డంలో ముందుగా ప్ర‌క‌టించిన తేదీల్లో అమ‌లు చేసి త‌న చిత్త‌శుద్ధిని రుజువు చేసుకున్నారు. 

33 నెలల పాలనలో 14 నెలలు కోవిడ్ పాండమిక్ సంక్షోభం ఎదుర్కొంటున్న పరిస్థితులలో ప్రపంచంలో సంపన్న దేశాలైన అమెరికా, జపాన్ లాంటి దేశాలు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. దేశంలో సంపన్న రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో కూడా అనేక కార్యక్రమాలు హామీలు ఇచ్చిన అక్కడ ప్రభుత్వాలు అమలు చేయలేకపోయాయి. వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు ప్రమాణం శ్రీకారం చేసి, ఫిబ్రవరి28 నాటికి 33 నెలలు పూర్తి అయినది. ఈ 33 నెలల్లో 14 నెలలు కోవిడ్ పాండమిక్ సంక్షోభం మూలంగా రాష్ట్ర అదాయం గణనీయంగా తగ్గింది. అయినప్పటి రైతులకు, పేద వర్గాలకు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నీ ప్రకటించిన తేదీలకు విడుదల చేయడం చాలా గొప్ప విషయం. శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అనుభవం లేదని పచ్చ ముఠా మాట్లాడినారు. ప్రజలకు మంచి చేయటానికి అనుభవము కంటే కూడా చిత్తసుద్ధి ఉంటే కార్యసిద్ధి జరుగుతుంది అనే దానికి ఉదాహారణ శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు.

ఈ 33 నెలల పాలనలో రాష్ట్ర ప్రజలకు వేల కోట్లు జరిగిన లబ్ది, లబ్ది పొందిన లక్షలాది కుటుంబ వివరాలను వెల్ల‌డిస్తూ అగ్రి మిష‌న్ వైస్ చైర్మ‌న్‌, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షులు ఎంవీఎస్ నాగిరెడ్డి ప్ర‌త్యేక క‌థ‌నం.   

దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా జూన్, 2019 నుండి ఫిబ్రవరి 28, 2022 వరకు ఆంధ్రప్రదేశ్లో జగనన్న ప్రభుత్వం పాలనలో ప్రవేశపెట్టిన వివిధ పథకాల ద్వారా లబ్దిపొందిన కుటుంబాల సంఖ్య వివరములు, ఖర్చు చేసిన మొత్తం

* డా॥ వై.యస్.ఆర్. రైతు భరోసా ప్రతి ఏడాది రూ.12,500/- నాలుగు సం॥రాలకు హామీ ఇచ్చి, దానిని ఏడాదికి రూ.13,500/- కు, పెంచి ఐదు సం॥రాలు అమలు చేయడము . జరుగుతుంది. ఇప్పటి వరకు రూ. 20,162 కోట్లు రైతులకు చెల్లించడము జరిగింది.

* అదనంగా వ్యవసాయానికి 9 గం. పగలు ఉచిత విద్యుత్ 18.7లక్షల కనెక్షన్లుకు అందించడానికి రూ.8,353 కోట్లు వ్యయం మరియు విద్యుత్ సబ్స్టేషన్ల ఆధునీకరణకు రూ.1700 కోట్లు .

* గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ డిస్కమ్లకు 20 వేల కోట్లు బకాయి ఇందులో రూ.8,750 కోట్లు ఉచిత విద్యుత్ బకాయి. 7 గం. లు ఉచిత విద్యుత్ సరఫరాకు రూ.8,750 కోట్లు బకాయి అంటే 15 నెలల వాడకానికి డబ్బు చెల్లించలేదు. అంటే 5 సంవత్సరాలకు 3సం. 9 నెలలు మాత్రమే ఆ ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇచ్చింది.

 

 .

Back to Top