చిత్తూరు : వివిధ సమస్యలతో సతమతమవుతున్న బాధితులకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేనున్నానని అండగా నిలిచారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా గుడిపాల మండలం చీలాపల్లి సిఎంసి హెలిపాడ్ వద్ద ప్రజల నుండి వినతుల స్వీకరించారు.. వివిధ వర్గాల ప్రజల నుండి వినతుల్ని స్వీకరిస్తూ వారు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించి వారి సమస్యల పరిష్కారంపై తక్షణమే స్పందించారు. వెంటనే ప్రభుత్వం తరపున బాధితులకు సాయం చేయాలని కలెక్టర్ ఎస్. షన్మోహన్ కు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి.* సీఎం ఆదేశాల మేరకు బాధితులకు తక్షణమే సాయం అందించిన కలెక్టర్. ముఖ్యమంత్రి వైయస్.జగన్ స్పందనతో సంతోషాన్ని వ్యక్తం చేసిన బాధితులు. 1.పిటిషనర్ పేరు:అనూష. చిరునామా:చంద్రయ్య గారి పల్లి,ఐరాల మండలం, వయస్సు: 23 సం. ఫోన్ నెం:8919813997 సమస్య: శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ముఖ్యమంత్రిని కలవడం జరిగింది. చికిత్స నిమిత్తం అన్ని విధాలుగా సహాయం చేస్తామని స్పందించిన ముఖ్యమంత్రి. 👉🏿జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా చికిత్స నిమిత్తం మంగళవారం రాత్రి కలెక్టరేట్ లో లక్ష రూపాయల చెక్కు అందజేత. 2. పిటిషనర్ పేరు:హుస్సేన్ బాష ఫోన్ నెం:9703059285 చిత్తూరు పట్టణానికి చెందిన హుస్సేన్ భాష అను వ్యక్తి తన రెండు నెలల కుమారుడుకి గుండె సమస్య ఉందని ముఖ్యమంత్రి విన్నవించారు. స్పందించిన ముఖ్యమంత్రి అబ్బాయికి అయ్యే ఖర్చులు ఇస్తామని చెప్పడంతో పాటు జిల్లా కలెక్టర్ ను ఉన్నత ఆసుపత్రికి పంపే ప్రయత్నం చేయాలన్నారు. 👉🏿జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా చికిత్స నిమిత్తం మంగళవారం రాత్రి కలెక్టరేట్ లో లక్ష రూపాయల చెక్కు అందజేత. 3. పిటిషనరు పేరు: విజయభాస్కర్. చిరునామా:పుంగనూరు. బ్రాహ్మణ వీధి .. వయస్సు: 40 సం. ఫోన్ నెంబర్:9959678848 సమస్య: తనకు బ్లడ్ క్యాన్సర్ ఉందని ముఖ్యమంత్రికి అర్జీ ఇచ్చి సమస్యను విన్నవించుకున్నారు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెలకు పదివేల రూపాయలు పెన్షన్ ను ఆగస్టు అందజేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. చికిత్సకు సంబంధించిన అంశాన్ని పరిశీలించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. 👉🏿జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా చికిత్స నిమిత్తం మంగళవారం రాత్రి కలెక్టరేట్ లో లక్ష రూపాయల చెక్కు అందజేత. 4. పిటిషనర్ పేరు:నళిని. చిరునామా:వెదురుకుప్పం మండలం, తిరుమలయ్య పల్లి సమస్య: నళిని తాను కిడ్నీ సమస్యతో బాధపడు తున్నానని ముఖ్యమంత్రి కి విన్నవించుకోగా ఆమెకు సంబంధించి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కు అయ్యే ఖర్చు భరించడంతోపాటు నెలకు పదివేల రూపాయల పెన్షన్ అందజేయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. 👉🏿జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా చికిత్స నిమిత్తం మంగళవారం రాత్రి కలెక్టరేట్ లో లక్ష రూపాయల చెక్కు అందజేత. 5. పిటీషనర్ పేరు: పి. సల్మాన్ ఖాన్ చిరునామా:నూతన కాల్వ, కె.వి పల్లి ఫోన్ నెంబర్:6281806193 సమస్య: తన తమ్ముడు పి సల్మాన్ ఖాన్ యాక్సిడెంట్ కారణంగా కోమా లో ఉన్నాడని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా యని ఆర్ధిక సాయం చేయమని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. 👉🏿జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా చికిత్స నిమిత్తం మంగళవారం రాత్రి కలెక్టరేట్ లో లక్ష రూపాయల చెక్కు అందజేత.