తప్పదు..మాట వినక తప్పదు

 

చంద్రబాబుగారికి ఊరికే కోపం వచ్చేస్తోంది. మోదీ, కేసీఆర్, జగన్‌ అంటూ రోజు పదిసార్లు కోపాన్ని ప్రకటిస్తూనే వున్నారు. అది చాలక ఏకంగా ఎలెక్షన్‌ కమిషన్‌ మీదనే మండిపడటం మొదలు పెట్టారు. ఈ మధ్య కడప, శ్రీకాకుళం ఎస్పీలతో పాటు, ఇంటలిజెన్స్‌ ఐజీ వెంకటేశ్వరరావును ఈసీ బదిలీ చేసింది. హెడ్‌ క్వార్టర్స్‌కు రిపోర్టు చేయమంది. అప్పుడు మండింది బాబుకు. మా ప్రభుత్వం మీద పెత్తనమేంది అన్నారు. ప్రజల ముందు మొరపెట్టుకున్నారు. ఆయన మాటలు విన్న ప్రజలు...అవును, ఎన్నికల కోడ్‌ వచ్చాక...అంతా ఈసీ పరిధిలోకే అంటారుగా...మరి బాబుగారు ఎందుకిలా భుజాలు తడుముకుంటున్నారని ఆలోచనల్లో పడ్డారు. అసలే ఎండపోటు. ఆపై బాబు మంట. ఇదిలా సాగుతుండగానే బాబుగారు ఈసీ ఉత్తర్వులపై హైకోర్టులో పిటీషన్‌ వేశారు. ఇంటలిజెన్స్‌ డీజీ ఈసీ పరిధిలోకి రాడన్నారు. పిటీషన్‌ను స్వీకరించిన హైకోర్టు మాత్రం...అవేవీ కుదరవని స్పష్టంగా చెప్పింది. 

ఈసీ ఆదేశాలు శిరసావహించాల్సిందేనని బాబు సర్కారుకు మొట్టికాయ వేసింది. బాబుగారు ఇక ఏమనగలరు? ఏమంటారో చూద్దాం?

ఇంతకూ నిన్ననో, మొన్ననో ఈసీ...అవును ఇంటలిజెన్స్‌ విభాగం పోలీస్‌ డిపార్టుమెంటుకు సంబంధించి కాదా? ఎన్నికల వేళ ఈసీకి జవాబుదారీ కాదా? అని ప్రశ్నించింది. అది అలా వుండగానే...ఇప్పుడిలా హైకోర్టులో చెంపపెట్టు. 

ఇదంతా పక్కనబెడితే...ఈసీ గురించి 2009లో బాబుగారు ఏమన్నారు? 2019కి వచ్చేసరికి ఆయన ఏమంటున్నారు?

 

బాబుగారు కోరినట్టు వుండాలేమో చట్టమైనా...రాజ్యాంగమైనా...

మొత్తానికి బెంబేలెత్తిపోతున్న బాబుగారిని గమనిస్తుంటే...ఈ ఎన్నికలను ఎలా గట్టెక్కాలి? ఏం చెయ్యాలన్నది పక్కా ప్లాన్‌ వేసుకున్నట్టున్నారు. జరుగుతున్నవి చూస్తుంటే...ఎక్కడో తేడా కొట్టేటట్టు వుందన్నది ఆయన భయంలా వుంది. అందుకే తన భయాన్ని దాచుకుంటూ...అందరికేసి వేలు చూపిస్తున్నాడు. పాపం, నాలుగు వేళ్లు ఆయనవైపే వున్నాయి. 

Back to Top