పోల`వరం`కు తూట్లు!

ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి కనీస నీటిమట్టం 41.15 మీటర్లకే పరిమితం చేసిన కేంద్ర ప్రభుత్వం

ఈమేరకే ప్రాజెక్టు పూర్తికి నిధులిచ్చేందుకు ఆగస్టు 28న కేంద్ర కేబినెట్‌ ఆమోదం

ఎత్తు తగ్గించినా కేంద్ర కేబినెట్‌ భేటీలో అభ్యంతరం చెప్పని టీడీపీ మంత్రి రామ్మోహన్‌నాయుడు 

కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర సమాచార శాఖ మంత్రి మీడియాకు వెల్లడించడం రివాజు 

కానీ.. పోలవరానికి రూ.12,157.53 కోట్ల నిధులు మంజూరు చేయడాన్ని కూడా వెల్లడించని కేంద్ర సమాచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ 

ఎత్తు తగ్గింపు బహిర్గతమవుతుందనే ఆ రోజు ప్రస్తావించలేదంటున్న అధికారవర్గాలు 

ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తూ జల్‌ శక్తి శాఖ రాసిన లేఖల్లోనూ అదే అంశం స్పష్టీకరణ 

ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేయడంపై నోరుమెదపని రాష్ట్ర ప్రభుత్వం 

తగ్గించేందుకు అంగీకరించడం వల్లే నోరు విప్పడం లేదంటున్న అధికారవర్గాలు 

పోలవరం గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు.. గరిష్ట నీటి నిల్వ 194.6 టీఎంసీలు.. కానీ ఎత్తు 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల గరిష్టంగా నిల్వ చేసేది 115.44 టీఎంసీలే

వరద రోజుల్లో మినహా మిగతా సమయాల్లో పోలవరం ఆయకట్టుకు నీటిని అందించడం అసాధ్యమే

గోదావరి, కృష్ణా డెల్టాల స్థిరీకరణ సవాలే 

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, విశాఖకు తాగు, పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరా సైతం సాధ్యం కాదు 

960 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తికి విఘాతమే.. చంద్రబాబు చారిత్రక తప్పిదాలతో జీవనాడిని జీవచ్ఛవంగా మార్చేశారంటున్న అధికారవర్గాలు 

2019–24 మధ్య పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారంటూ చంద్రబాబు దుష్ప్రచారం 

ఇప్పుడు దాన్ని అస్త్రంగా చేసుకొని ఎత్తును కేంద్రం తగ్గించేసిందంటున్న నిపుణులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వమే ఉరి వేసి.. ఊపిరి తీసేసిందా? ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు అంగీకరించిందా? 41.15 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అంచనా వ్యయాన్ని సవరిస్తూ గత ఆగస్టు 28న కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసినప్పుడు.. ఆ సమావేశంలో పాల్గొన్న టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహ­న్‌­నాయుడు అభ్యంతరం చెప్పనిది అందుకేనా? అనే ప్రశ్నలకు అవుననే సమా­ధానం చెబుతున్నాయి కేంద్ర, రాష్ట్ర అధికా­రవర్గాలు! సాధారణంగా కేంద్ర కేబినెట్‌ తీసుకునే నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి అదే రోజు మీడియాకు వెల్లడిస్తారు. 

కానీ.. 41.15 మీటర్ల వరకూ పోల­వరం పూర్తి చేయడానికి రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు ఆమో­దముద్ర వేస్తూ ఆగస్టు 28న కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఆ రోజు మీడియాకు వెల్లడించలేదు. ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు అంశం బహిర్గతమవుతుందనే పోలవ­రా­నికి నిధులు మంజూరు చేసిన అంశాన్ని మంత్రి ఆ రోజు ప్రస్తావించలేదని అధి­కార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే చంద్ర­బాబు చేసిన చారిత్రక తప్పిదా­ల­తో­పాటు ఎత్తు తగ్గించడం వల్ల  ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం నీరుగారిపోయిందని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చుక్కాని..
⇒ పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల (150 అడుగులు) గరిష్ట నీటి మట్టంతో.. 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో.. 322 టీఎంసీలు వినియోగించుకునేలా నిర్మించుకోవడానికి గోదా­వరి ట్రిబ్యునల్‌ 1980లో అనుమతి ఇచ్చింది.

⇒ అయితే దాదాపు 25 ఏళ్ల­పాటు ప్రాజెక్టు నిర్మాణంపై ఏ ముఖ్యమంత్రీ కనీసం ఆలోచన చేసిన పాపాన పోలేదు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2005లో అన్ని అనుమతులు సాధించి పోల­వరం నిర్మాణాన్ని ప్రారంభించారు.

⇒ పోలవరం కుడి, ఎడమ కాలువల ద్వారా 7.20 లక్షల ఎకరాలు.. కృష్ణా, గోదావరి డెల్టాల్లో 23.31 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీ­కరణ.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 8 లక్షల ఎకరాలు వెరసి 38.51 లక్షల ఎకరాలకు నీళ్లందించవచ్చు. విశాఖ పారిశ్రా­మిక, తాగునీటి అవసరాల కోసం 23.44 టీఎంసీలను సరఫరా చేయవచ్చు. అంతేకాకుండా 960 మెగావాట్ల జల­విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.

⇒ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పోలవరం చుక్కానిలా నిలు­స్తుంది. అందుకే ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర ముఖ­చిత్రమే మారిపోతుందని నీటిపారు­దల రంగ నిపుణులు స్పష్టం చేస్తూ వస్తున్నారు.

జీవనాడి కాదు జీవచ్ఛవమే..!
⇒ పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువ­లకు 35.5 మీటర్ల నుంచి నీటిని సరఫరా చేయవచ్చు. ఎడమ కాలువ పూర్తి సామర్థ్యం 17,580 క్యూసెక్కులు కాగా కుడి కాలువ  పూర్తి సామర్థ్యం 17,560 క్యూసెక్కులు.

⇒ పోలవరం ప్రాజెక్టును 41.15 మీట­ర్లకు తగ్గించడం వల్ల జలాశ­యంలో గరిష్టంగా 115.44 టీఎంసీలు మాత్రమే ఉంటాయి. గోదావరికి గరిష్టంగా వరద వచ్చే రోజుల్లో ఆయకట్టుకు నీటిని సరఫరా చేయ­గలిగినా.. వరద లేని రోజుల్లో ఆయకట్టుకు నీళ్లందించడం సాధ్యం కాదని అధికా­ర­వర్గాలు చెబుతు­న్నా­యి.

⇒ కాలువల ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించాలంటే ప్రాజెక్టులో 41.15 మీటర్ల కంటే ఎగువన నీటి మట్టం ఉండాలి. అప్పుడే ఎడమ కాలువ కింద 4 లక్షలు.. కుడి కాలువ కింద 3.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడడంతోపాటు కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించడానికి అవకాశం ఉంటుంది.

⇒ పోలవరం ఆయకట్టు 7.20 లక్షల ఎకరాలతోపాటు కృష్ణా, గోదావరి డెల్టాల ఆయ­కట్టు స్థిరీకరణ, ఉత్త­రాంధ్ర సుజల స్రవంతి, విశాఖకు పారిశ్రా­మి­క, తాగు­నీటి అవసరాలు తీర్చడం అసా­ధ్యమని స్పష్టం చేస్తు­న్నారు. 960 మెగా­వాట్ల జలవిద్యుత్‌ కూడా ఉత్పత్తి చేయడం సాధ్యం కాదని తేల్చి­చెబుతున్నారు.

⇒ ఎత్తు తగ్గించడం వల్ల జీవనాడి పోలవరం ప్రాజెక్టును జీవచ్ఛవంగా మార్చేశారని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నా­రు.

తగ్గించేందుకు తలూపడం వల్లే..
పోలవరం ప్రాజెక్టును కనీస నీటిమట్టం 41.15 మీటర్ల వరకూ పూర్తి చేసేందుకు అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లకు సవరిస్తూ ఆగస్టు 28న కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసిందని.. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా చేసిన వ్యయం పోనూ మిగతా రూ.12,157.53 కోట్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్‌ శక్తి శాఖ సీనియర్‌ జాయింట్‌ కమిషనర్‌ దీపక్‌ చంద్ర భట్‌ లేఖ రాశారు. ప్రాజె­క్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయా­లని... ఈ క్రమంలో 2024–­25లో ఏ మేరకు నిధులు కావాలో ప్రతి­పాద­నలు పంపాలని ఆ లేఖలో కోరారు. 

ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తు­న్నట్లు ఈ లేఖలో కేంద్రం స్పష్టం చేసినా రాష్ట్ర ప్రభుత్వం నోరుమెదప­లేదు. అంటే.. ప్రాజెక్టు ఎత్తును తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందన్నది స్పష్ట­మ­వు­తోంది. ప్రాజెక్టుకు రూ.2,348 కోట్లను అడ్వాన్సుగా విడుదల చేస్తూ ఈనెల 9న రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలోనూ దీపక్‌ చంద్ర భట్‌ అదే అంశాన్ని పునరు­ద్ఘాటించారు. ప్రాజెక్టును పూర్తి చేయడా­నికి కేంద్ర కేబినెట్‌ ఆమోదించిన సవరించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం అంగీక­రించిందని.. ఆ మేరకు ఎంవో­యూ కుదుర్చుకుందని ఆ లేఖలో పేర్కొన్నారు.

కేంద్రానికి రూ.23,622 కోట్లకుపైగా మిగులు..
కేంద్ర జలసంఘం టీఏసీ ఆమోదించిన ప్రకా­రం పోల­వరం అంచనా వ్యయం 2017–­18 ధరల ప్రకారం రూ.55,656.87 కోట్లు. రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ ఖరారు చేసిన దాని ప్రకారం రూ.47,725.74 కోట్లుగా ఉంది. పోల­వరానికి ఇప్పటి­వరకూ కేంద్రం రూ.15,146.28 కోట్లను రీయింబర్స్‌ చేసింది. 2014 ఏప్రిల్‌ 1కి ముందు ప్రాజెక్టుకు రూ.4,730.71 కోట్లు ఖర్చు చేశారు. అంటే.. ఇప్పటి­దాకా ప్రాజెక్టు కోసం రూ.19,876.99 కోట్లు ఖర్చు చేసి­నట్లు లెక్క. 

సీడబ్ల్యూసీ టీఏసీ ఆమో­దించిన అంచనా వ్యయం ప్రకా­రం చూస్తే పోల­వరానికి ఇంకా రూ.35,779.88 కోట్లు రావాలి. ప్రస్తుతం రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. అంటే ఇంకా రూ.23,622.35 కోట్లు విభ­జన చట్టం ప్రకారం కేంద్రం ఇవ్వాలి. ఆ నిధులు ఇస్తేనే 41.15 మీటర్ల కాంటూరు నుంచి 45.72 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేయడానికి అవసరమైన ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించవచ్చు. భూమిని సేకరించవచ్చు. కానీ.. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేయడంతో కేంద్రానికి రూ.23,622.35 కోట్లు మిగిలినట్లైంది. 

Govt Negligence on Polavaram Project Victims: Andhra Pradesh

 పోలవరం నిర్వాసితుల నోట్లో మట్టి 

వైఎస్‌ జగన్‌ పెంచిన రూ.10 లక్షల ప్యాకేజీకి మంగళం  

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితల సొమ్ముకు సీఎం చంద్రబాబు ఎసరు పెట్టారు. వారికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రకటించిన ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ రూ.10 లక్షలు కాదని, ఎనిమిదేళ్ల క్రితం అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన ప్యాజీనే అమలు చేసే యోచనలో బాబు ప్రభుత్వం ఉంది. ఈమేరకు అధికారులు బిల్లులు సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీని ప్రకారం ఇప్పుడు ప్రతి నిర్వాసితుడికి దాదాపు రూ.3.5 లక్షల కోత పడుతుంది. దీనిపై నిర్వాసితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   
2017లో ప్యాకేజీ ఇలా.. 
ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 41.15 కాంటూర్‌ పరిధిలో ఎనిమిది మండలాల్లో 90 రెవెన్యూ గ్రామాల్లో 38,060 మంది పోలవరం నిర్వాసితులున్నారు.  ఇందులో ఏడు మండలాలు తెలంగాణ నుంచి కలుపుకున్నవి కాగా మరో మండలం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. 2017లో 2013 భూసేకరణ చట్టం ప్రకారం గిరిజనేతరులకు రూ.6.36 లక్షలు ప్యాకేజీ ప్రకటించారు. ఇందులో వారి æజీవితాంతం ఉపాధికి రూ.5 లక్షలు, అలవెన్స్‌ రూ.36,000, రవాణా చార్జీలకు రూ.50 వేలు, పునరావాస అలవెన్స్‌గా రూ.50 వేలు ఉన్నాయి. ఎస్టీలు, ఎస్సీలకు రూ.50 వేలు అదనంగా ఇచి ప్యాకేజీ రూ.6.86 లక్షలుగా నిర్ణయించారు. 

లబ్ధిదారులు, ప్యాకేజీని పెంచిన జగన్‌ 
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్వాసితులు అందరినీ ప్యాకేజీలోకి తీసుకొచ్చారు. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతూరు, వీఆర్‌పురం, కూనవరం మండలాల్లోని 36 గ్రామాలకు చెందిన మరో 13,937 మంది నిర్వాసితులను లబి్ధదారులుగా చేర్చారు. దీంతో మొత్తం నిర్వాసితుల సంఖ్య 44,797కు పెరిగింది. నిర్వాసితుల కష్టాలు కళ్లారా చూసి, వారి ఆరి్థక స్థితిగతులను పరిగణనలోకి తీసుకొన్న వైఎస్‌ జగన్‌ పెరిగిన ధరలకనుగుణంగా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకి మరో రూ.3.64 లక్షలు కలిపి రూ.10 లక్షలకు పెంచారు. అదనంగా రూ.550 కోట్లు కూడా కేటాయించారు. వైఎస్‌ జగన్‌ మరోసారి ముఖ్యమంత్రి అయి ఉంటే నిర్వాసితులకు పెరిగిన ప్యాకేజీ లభించేది. నిర్వాసితుల త్యాగాలకు అర్థం ఉండేది.

నిర్వాసితులకు అన్యాయం చేస్తున్న బాబు
ఏ ప్రభుత్వమైనా ఓ ప్రాజెక్టు కోసం భూములిచ్చి త్యాగం చేసిన వారికి న్యాయం చేయాలి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పోలవరం నిర్వాసితులకు తీరని అన్యాయానికి ఒడిగట్టింది. వాస్తవంగా ప్రస్తుత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా నిర్వాసితలకు ప్యాకేజీని సవరిస్తే రూ.13 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంది. ఈమేరకు పెంచకపోగా, గత ప్రభుత్వం పెంచిన ప్యాకేజీని కాదని 2017లో ప్రకటించన మేరకే ఇచ్చి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తోంది. నిర్వాసితులకు ఇవ్వాల్సిన రూ.550 కోట్లకు ఎసరు పెడుతోంది.

నిర్వాసితుల త్యాగాలను గుర్తించిన జగన్‌ 
పోలవరం నిర్వాసితుల త్యాగాలను గుర్తించి మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జారీ చేసిన రూ.10 లక్షల జీవోను ప్రస్తుత సీఎం చంద్రబాబు అమలు చేయాలి. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని,  పార్టీలకతీతంగా నిర్వాసితులకు న్యాయం చేయాలి.

రూ.13 లక్షలు ఇవ్వాలి  
పెరిగిన ధరలకు అనుగుణంగా ఆర్‌ అండ్‌ ఆర్‌ వ్యక్తిగత ప్యాకేజీ రూ.13 లక్షలు ఇవ్వాలి. ప్రాజెకు నిర్మాణ వ్యయాన్ని  ఏటా పెంచుతున్నారు. నిర్వాసితులకు మాత్రం 2017లో ప్రకటించిన పాత ప్యాకేజీ ఇస్తామంటున్నారు. ఇదెక్కడి న్యాయం? 
– కుంజం మురళి, ఎంపీపీ, దేవీపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా  

మా త్యాగాలకు విలువ లేదా? 
నిర్వాసితులు త్యాగమూర్తులంటూ వేదికలపై సీఎం చంద్రబాబు చెబతారు. ప్యాకేజీ విషయానికొస్తే ఉపాధి కూలీలకు ఇచ్చే రోజువారీ వేతనమంత కూడా లేదు. ఉపాధి కూలీలకు 2017లో రోజువారీ వేతనం రూ.150 ఉంటే ప్రస్తుతం రూ.300కు పెరిగింది. మాకు మాత్రం ఎనిమిదేళ్ల క్రితం ప్యాకేజీ ఇవ్వడం అన్యాయం. మా త్యాగాలకు గుర్తింపు ఇదేనా?  – గుజ్జా విజయ, జెడ్పీటీసీ సభ్యురాలు, కూనవరం మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా 

Back to Top