దళితులపై దమనకాండ

దళిత మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కక్షపూరితంగా వేధిస్తున్న బాబు సర్కారు 

దళితులకు నాయకత్వం లేకుండా చేసి అణగదొక్కే కుట్రలు

నిజాయితీగా పనిచేసిన ఐపీఎస్, ఐఆర్‌ఎస్‌ నుంచి మండల స్థాయి అధికారులపై సాధింపు చర్యలు

అధికారంలోకి వస్తూనే మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసిన కూటమి ప్రభుత్వం

మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌పైనా కేసులు

పేకాట కార్యకలాపాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చినందుకు యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై కేసు నమోదు

మేరుగు నాగార్జున, పినిపే విశ్వరూప్‌ కుమారుడు డాక్టర్‌ శ్రీకాంత్‌పైనా అక్రమ కేసులు

నిష్పక్షపాతంగా పనిచేసిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిఎన్‌.సంజయ్‌పై సస్పెన్షన్‌ వేటు

ఐపీఎస్‌ పీవీ సునీల్‌కుమార్‌కు వేధింపులు

ఐపీఎస్‌లు పాల్‌రాజు, జాషువాకు పోస్టింగ్‌లు ఇవ్వని ప్రభుత్వం

రాజకీయ దురుద్దేశాలతో సీనియర్‌ పోలీస్‌ అధికారి విజయ్‌పాల్‌ అరెస్టు  

చట్టబద్ధంగా వ్యవహరించి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమాలను వెలికి తీసిన ఐఆర్‌ఎస్‌ రామకృష్ణపై కక్ష సాధింపులు 

కూటమి సర్కారు మోసాలు, అక్రమాలు, వైఫల్యాలపై నిలదీస్తూ పోస్టులు పెట్టినందుకు ఎస్సీ వర్గానికి చెందిన సామాజిక కార్యకర్తలకు వేధింపులు

పోలీసు స్టేషన్‌లో అర్ధ నగ్నంగా నిలబెట్టి అవమానాలకు గురిచేసిన వైనం

 అమరావతి: ‘‘ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..?’’ అంటూ అహంకారపూరితంగా దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు! ఆ వర్గాన్ని ఉక్కుపాదంతో అణగదొక్కుతూ.. దళితులకు అసలు నాయకత్వమే లేకుండా చేయాలనే దుర్నీతితో సాగుతున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడం.. ప్రశ్నించడమే పాపమన్నట్లు  వ్యవహరిస్తున్నారు.

ఒకపక్క ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అనుక్షణం వేధింపులకు గురిచేస్తూ.. మరోవైపు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్, ఆర్డీవో, డీఎస్పీ, మండల స్థాయి అధికారులపై కక్ష సాధింపు చర్యలకు ఉపక్రమించారు. సూపర్‌ సిక్స్‌ సహా హామీల అమలు, అక్రమాలు, వైఫల్యాలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినందుకు ఎస్సీ వర్గానికి చెందిన సామాజిక కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. 

వారిని పోలీసు స్టేషన్లలో అర్ధ నగ్నంగా నిలబెట్టి అవమానాలకు గురి చేసిన ఘటనపై సర్వత్రా విభ్రాంతి వ్యక్తమవుతోంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచి ఎస్సీలను ఉక్కుపాదంతో అణచివేత చర్యలను రోజు రోజుకు ఉద్ధృతం చేస్తున్నారని ఆ సామాజిక వర్గ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

రాజకీయ కక్ష సాధింపులు..
» అధికారంలోకి వస్తూనే వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను లక్ష్యంగా చేసుకున్న కూటమి ప్రభుత్వం ఆయనపై వరుసగా కేసులు నమోదు చేస్తూ రాజకీయ వేధింపులకు తెర తీసింది. దళితులకు నాయకత్వం లేకుండా చేయాలనే కుట్రపూరిత ధోరణితో వివిధ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో వరుసగా కేసులు నమోదు చేస్తూ బెయిల్‌ రాకుండా అడ్డుకుంటోంది. 

నందిగం సురేష్ పై అసలు ఎక్కడెక్కడ, ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలంటూ స్వయంగా హైకోర్టు ఆదేశించడం రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. అన్యాయంపై ప్రశ్నించడం.. దళితుల్లో స్ఫూర్తి రగల్చడమే పాపమనే విధంగా దళిత నేతల పట్ల కూటమి సర్కారు దుర్నీతితో వ్యవహరిస్తోంది.  

»    చంద్రబాబుపై గతంలో గులకరాయి పడిన ఘటనకు సంబంధించి నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌లపై కూటమి సర్కారు ఇప్పుడు అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు దిగింది.  

»    కూటమి సర్కారు రాజకీయ క్షక్ష సాధింపుల్లో భాగంగా నారా లోకేశ్‌పై ట్వీట్‌ చేశారంటూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో పలు కేసులు నమోదు చేసింది. 

జోరుగా సాగుతున్న పేకాట కార్యకలాపాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చిన ఓ ప్రజాప్రతినిధి పట్ల ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. జరుగుతున్న విషయాన్ని చెబితే దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా విపక్షంలో ఉన్నారనే ఏకైక కారణంతో ఓ ఎమ్మెల్యేపై కేసులు బనాయించడం కూటమి సర్కారు అరాచకాలకు పరాకాష్ట.  

»   బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో గతేడాది ఓ వలంటీర్‌ మృతి చెందిన ఘటనకు సంబంధించి మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న కూటమి సర్కారు అధికారంలోకి రాగానే ఈ కేసులో ఎలాంటి సంబంధం లేని విశ్వరూప్‌ కుమారుడు డాక్టర్‌ శ్రీకాంత్‌ను అక్రమంగా అరెస్టు చేసింది. డాక్టర్‌ శ్రీకాంత్‌ను ఏ 1గా చేర్చి జైలుకు తరలించింది. ఇటీవల ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.  

»  మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ మాజీ అధ్యక్షుడు మేరుగు నాగార్జునపై టీడీపీ నేతలు ఓ మహిళతో తప్పుడు కేసు పెట్టించారు. నాగార్జున డబ్బులు తీసుకుని మోసం చేశారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో తప్పుడు కేసు బనాయించారు. అయితే తనపై అధికార పార్టీ నాయకులు తీవ్ర ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించినట్లు ఆ మహిళ అఫిడవిట్‌లో పేర్కొంది. తాను ఎన్నడూ మేరుగు నాగార్జునను చూడలేదని, తమ ఇద్దరి మధ్య ఎలాంటి ఆరి్థక లావాదేవీలు లేవని అందులో వెల్లడించడం గమనార్హం.

విద్యావంతుడికి అవమానాలు.. 
రాజమహేంద్రవరంలో వరదలు వచి్చనప్పుడు ప్రజలు పడిన ఇబ్బందులను నెల రోజుల్లోనే పరిష్కరించినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. దీనిపై స్పందించిన విద్యావంతుడైన దళిత యువకుడు పులి సాగర్‌ తాను నివాసం ఉండే కృష్ణానగర్, బ్రదరన్‌ చర్చి ప్రాంతాల్లో వరద నీరు ఇంకా నిల్వ ఉండటం, సమస్యలు తొలగకపోవడంపై ప్రశ్నిస్తూ పోస్టు పెట్టారు. దీంతో ఆయనపై కేసులు నమోదు చేసిన కూటమి ప్రభుత్వం దారుణ అవమానాలకు గురి చేసింది. 

పోలీసు స్టేషన్‌కు రావాలని ఆదేశించడంతో ఈ నెల 2న ఆయన రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్‌ స్టేషన్‌కు వెళ్లారు. బీఎస్సీ, బీఈడీ చదివిన తనను పోలీసులు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతూ, బెదిరిస్తూ.. సెల్‌లో అర్ధనగ్నంగా నిలబెట్టి.. మహిళా పోలీసు కానిస్టేబుళ్లను కాపలాగా ఉంచారని పులి సాగర్‌ వాపోయారు. దళిత యువకుడిని పోలీసులు ఘోరంగా అవమానించిన తీరును సామాజికవేత్తలు ఖండిస్తున్నారు.  

»  చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గంలో గత ఎన్నికల సమయంలో విద్యుత్తు సబ్‌ స్టేషన్‌లో ప్రమాదానికి సంబంధించి టీడీపీ నాయకుల ప్రోద్బలంతో దళితుడైన యాదమరి ఎంపీపీ సురేష్‌ బాబుపై చిత్తూరు టూ టౌన్‌ సీఐ అక్రమ కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వెలువడగానే పూతలపట్టు మండలం ఎగువ పాలకూరు దళితవాడలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన హరి, జయపాల్, భారతి, బాబుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు.   

» రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం తప్పెటవారిపల్లెలో ఇటీవల దళిత వర్గానికి చెందిన ప్రభుపై టీడీపీ సానుభూతిపరులు మరుగుతున్న నూనెను ఒంటిపై పోయడంతో తీవ్ర గాయాలతో కడప రిమ్స్‌లో చేరాడు. 

» దళితుడనే చిన్న చూపుతో రాజంపేట మున్సిపల్‌ కమిషనర్‌ రాంబాబును టీడీపీ నాయకులు ఆయన కార్యాలయంలోనే వేధించారు. తీవ్ర మానసిక వేధింపులతో కలత చెందిన ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

అధికార యంత్రాంగంపై వేధింపులు
» ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ సంజయ్‌కు నిష్పక్షపాతంగా పని చేస్తారనే పేరుంది. ఆయన ఏ రాజకీయ పక్షానికీ కొమ్ము కాయరని ఐపీఎస్‌ అధికారులే స్పష్టం చేస్తున్నారు. అగి్నమాపక డీజీ, సీఐడీ చీఫ్‌ హోదాల్లో సంజయ్‌ అక్రమాలు, నిధుల దురి్వనియోగానికి పాల్పడ్డారనే నెపం మోపి ఆయన్ను కూటమి ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.  

»   ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌ను వేధింపులకు గురి చేస్తున్న కూటమి సర్కారు ఐపీఎస్‌లు పాల్‌రాజు, జాషువాకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా కక్ష సాధిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఐపీఎస్‌ అధికారి అన్బురాజన్‌కు పోస్టింగ్‌ ఇవ్వలేదు. రాజకీయ దురుద్దేశాలతో రిటైర్డ్‌ సీనియర్‌ పోలీస్‌ అధికారి విజయ్‌పాల్‌ను వేధించి అరెస్టు చేసింది.    

»   ఐఆర్‌ఎస్‌ అధికారి రామకృష్ణకు నిజాయితీగా, చట్ట ప్రకారం వ్యవహరిస్తారని అధికార వర్గాల్లో పేరుంది. గత ప్రభుత్వంలో ఆయన స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ ఐజీగా  పని చేశారు. విధి నిర్వహణలో నిక్కచి్చగా వ్యవహరించిన రామకృష్ణపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తనిఖీలు నిర్వహించి అక్రమాలను వెలికి తీసినందుకు ఆయనపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు దిగింది. 

Back to Top