రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు రెడ్‌బుక్ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఓటు వేయలేదన్న నెపంతో అధికార పార్టీ దాడులు, దౌర్జన్యాలకు పాల్పడింది. ఆరు నెలల పాలనలో రోజుకు ఒకటికి మించి హత్యలు.. రోజున్నరకు ఓ అత్యాచారం.. రోజుకు 10కిపైగా అక్రమ కేసులు.. రోజుకు 25కుపైగా దాడులు, దౌర్జన్యాలు.. స్వయంగా చంద్రబాబు, లోకేశ్ ప్రామాణికంగా తీసుకున్న రెడ్‌బుక్ పాలన రాష్ట్రంలో అధికారికంగా బీభత్సం సృష్టిస్తోంది. 75ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఆరు నెలల్లోనే దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, అక్రమ కేసులతో బెంబేలెత్తిపోతోంది. చంద్రబాబు పాలనలో శాంతభద్రతలు చేష్టలుడిగి చూస్తుంటే.. సామాన్యుడి బతుకు ఛిద్రమైపోతోంది. రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. టీడీపీ గూండాలు, రౌడీమూకలు యథేచ్చగా హత్యలు, హత్యాయత్నాలు, దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నాయి. చీనీ తోటలు నరికేస్తున్నారు. దళిత వాడలపై దండెత్తుతున్నారు. సామాన్యులను హడలెత్తించి గ్రామాల నుంచి వెళ్లగొడుతున్నారు. వరుస అత్యాచారాలు, లైంగిక దాడులతో రాష్ట్రంలో కీచకపర్వం యథేచ్చగా కొనసాగుతోంది. ఇక వైయస్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలతోపాటు సామాన్య సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమ కేసులతో అడ్డూ అదుపు లేకుండా వేధిస్తున్నారు. చంద్రబాబు మార్కు కక్షసాధింపు చర్యలతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం రెడ్‌బుక్ రాజ్యాంగ బాధితులుగా మారిపోయారు. టీడీపీ సాగిస్తున్న అరాచక యజ్ఞంలో సామాన్యుల బతుకులే సమిధులవుతున్నాయి. అరాచకాలే బ్రాండ్.. అదే బాబు పాలన ట్రెండ్ చంద్రబాబు ప్రభుత్వం దాపరికం లేకుండా అరాచకానికి బరితెగిస్తోంది. లోకేశ్ ఫొటోలతోసహా రెడ్‌బుక్ హోర్డింగులు ఏర్పాటు చేయడం ద్వారా మారణహోమంతో బీభత్సం సృష్టించడమే ప్రభుత్వ అజెండా అని అధికారికంగా ప్రకటించడం టీడీపీ కూటమికే చెల్లింది. తద్వారా టీడీపీ గూండాలు కత్తులు, కర్రలు, బాంబులతో యథేచ్ఛగా దాడుల చేయాలని ఆదేశించింది. అందుకు పోలీసులు సహకరించాలి లేదా పక్కకు తప్పుకోవాలని స్పష్టం చేసింది. ప్రభుత్వమే అధికారికంగా గూండాగిరీకి తెగిస్తే ఎంతటి విధ్వంసం సాగుతుందన్నది యావత్ రాష్ట్రం ఈ 6 నెలల్లో చూసింది. పచ్చ మూకల కీచకపర్వం ఆరు నెలల్లో 126 అత్యాచారాలు, లైంగిక దాడులు చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో కీచకపర్వం అడ్డూఅదుపులేకుండా సాగుతోంది. ఒకప్పటి చంబల్ లోయలోని అకృత్యాలను తలపిస్తూ రాష్ట్రంలో పచ్చమూకలు మహిళలు, బాలికలపై లైంగిక దాడులకు తెగబడుతున్నాయి. అత్యాచారానికి పాల్పడటమే కాకుండా బాధిత మహిళల్ని హతమార్చి మరీ దర్జాగా జారుకుంటున్నారు. 6 నెలల్లోనే ఏపీలో 126 మంది మహిళలు, బాలికలపై అత్యాచారాలకు, దాడులకు తెగబడటం రాక్షస పాలనకు అద్దం పడుతోంది. వారిలో 12 మందిపై అత్యాచారం జరిపి హత్య చేయడం రౌడీ మూకల బరితెగింపునకు నిదర్శనం. ఇవన్నీ అధికారికంగా కేసులు నమోదైన ఘటనలే. కూటమి పెద్దలు, గూండాలకు భయపడి బాధితులు ఫిర్యాదులు చేయని ఉదంతాలు అంతకు రెట్టింపు సంఖ్యలో ఉన్నాయన్నది పచ్చి నిజం. 229 హత్యలు.. 750కుపైగా హత్యాయత్నాలు చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న హత్యాకాండ బెంబేలెత్తిస్తోంది. 6 నెలల్లో రాష్ట్రంలో ఏకంగా 229 మందిని హత్య చేశారు. 750కుపైగా హత్యాయత్నాలకు తెగబడ్డారు. 4 వేలకుపైగా దాడులతో విధ్వంసం సృష్టించారు. 2 వేలకుపైగా ప్రైవేటు ఆస్తులు, 5 వేలకుపైగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. టీడీపీ గూండాల దాడులతో బెంబేలెత్తి దాదాపు 5వేల కుటుంబాలు గ్రామాలను విడిచిపెట్టి వలసపోయాయి. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ.. రాజ్యాంగ హక్కుల కాలరాత సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులతో చంద్రబాబు ప్రభుత్వ అరాచకం పతాకస్థాయికి చేరింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు నమోదు చేస్తూ అక్రమ నిర్బంధాలు, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. భౌతిక దాడులకు దిగుతూ.. కోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ వేధింపులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. ఎమర్జెన్సీ తరహా పాలనను కూటమి సర్కారు రాష్ట్రంపై రుద్దుతోంది. సెక్షన్లను మారుస్తూ.. చట్టాలను ఏమారుస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోంది. ఇప్పటివరకు 253 అక్రమ కేసులు నమోదు చేసి 822 మందికి నోటీసులిచ్చింది. 85 మందిని అక్రమంగా అరెస్ట్ చేసింది. రెడ్‌బుక్ రాజ్యాంగానికి పోలీస్ దాసోహం పోలీస్ శాఖ లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగానికి గులాంగిరీ చేస్తూ టీడీపీ అరాచకానికి కొమ్ముకాస్తోంది. టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలు, గూండాలు యథేచ్ఛగా హత్యలు, దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నా పోలీస్ శాఖ చోద్యం చూస్తోంది. ఏకంగా అఖిల భారత సర్వీస్ అధికారులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ అధికారులు కూడా రెడ్‌బుక్ రాజ్యాంగ బాధితులుగా మారిపోవడం ప్రస్తుత వైచిత్రి. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించకముందే అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డిని బలవంతంగా సెలవుపై పంపారు. అధికారం చేపట్టిన తరువాత ఏకంగా 10 మంది ఐఏఎస్, 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధించారు. వలపు వల, ఫోర్జరీ కేసుల్లో నిందితురాలు కాదంబరి జత్వానీని అడ్డుపెట్టుకుని ఐపీఎస్ అధికారులు పీఏఎస్‌ఆర్ ఆంజనేయులు, టి.కాంతిరాణా, విశాల్‌గున్నీలను అక్రమంగా సస్పెండ్ చేసింది. అదనపు డీజీ సంజయ్‌ను కక్షపూరితంగా సస్పెండ్ చేసింది. ఆరు నెలల్లోనే రాష్ట్రంలో 229 హత్యలు 750కిపైగా హత్యాయత్నాలు.. 4 వేలకుపైగా దాడులు 7వేలకుపైగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం 126 అత్యాచారాలు, లైంగిక దాడులు వారిలో 12 మందిపై అత్యాచారం.. హత్య వైయస్ఆర్‌సీపీ నేతలే లక్ష్యంగా కుట్ర వైయస్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. వైయస్ఆర్‌సీపీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే తాటిపర్తి, మాజీ ఎంపీలు నందిగం సురేశ్, రెడ్డప్ప, మాజీ మంత్రులు విశ్వరూప్, పేర్ని, కొడాలి నాని, జోగి రమేశ్, మేరుగు నాగార్జున, కాకాణి, రోజా, రజినీ, మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి, పెద్దారెడ్డి, చెవిరెడ్డి, వల్లభనేని వంశీ, కేతిరెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల, పార్టీ నేతలు దేవినేని అవినాశ్, సజ్జల భార్గవ్‌రెడ్డి, వైవీ విక్రాంత్‌రెడ్డి , పేర్ని నాని, ఆయన సతీమణి జయసుధా, తాజాగా హైకోర్టు న్యాయవాది జల్లా సుదర్శన్‌రెడ్డి, తదితరులతోపాటు వైయస్ఆర్‌సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలపై టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి వేధిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. వారి ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు. దళిత నేతలు, అధికారులే టార్గెట్ రాష్ట్రంలో వైయస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టు చేసి తీసుకొస్తున్న పోలీసులు, వారిని అక్రమంగా నిర్భంధించి వేధించడమే కాకుండా, ఒక్కొక్కరిపై ఐదారు అక్రమ కేసులు బనాయించి పీటీ వారెంట్‌లతో వేర్వేరు జైళ్లకు తరలిస్తున్నారని మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో నిర్బంధించిన సుధారాణి దంపతులను పరామర్శించడానికి వస్తే, తమ రాకకు కొద్ది గంటల ముందే వారిని పీటీ వారెంట్‌తో వేరే జైలుకు తరలించారని తెలిసిందని, ఈ విధంగా కొత్త తరహా వేధింపులకు పోలీసులు తెర తీశారని వారు ఆక్షేపించారు. హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే తప్ప కార్యకర్తల ఆచూకీ చెప్పని పోలీసులు, వర్రా రవీంద్రారెడ్డిని సైతం సంధ్యారాణి మాదిరిగానే అర్థరాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజకూ అరాచకత్వం పెరిగిపోతోంది. టీడీపీ, బీజేపీ, జనసేనలతో కూడిన అధికార కూటమి తాజాగా రాష్ట్రంలో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్న దళిత వర్గాలను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. అరడజను మంది దళిత నేతలతోపాటు ఇదే వర్గానికి చెందిన ఐదుగురు ఆలిండియా సర్వీసు అధికారులను ఈ ప్రభుత్వం వేధిస్తున్నట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా...పలువురు సామాన్య దళితులు సైతం వివక్ష, అవమానాలకు గురవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అసలు రాష్ట్రంలో పౌర హక్కులు అనేవి ఉన్నాయా? లేవా? అన్న ప్రశ్న వస్తోంది. ప్రశ్నించే గొంతులను అణచివేసేందుకు ఈ ప్రభుత్వం ఏమాత్రం వెనుకాడటం లేదన్న విమర్శలూ ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై నిజంగా ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. కానీ అధికారంలోకి వచ్చాక ఎంతమంది దళితులపై కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నది చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై హత్య కేసుతో సహా పలు కేసులు పెట్టి నెలల తరబడి జలులో ఉంచుతున్నారు. 201419 మధ్యకాలంఓనూ నందిగం సురేష్ పై చంద్రబాబు ప్రభుత్వం పలు కేసులు పెట్టింది. అమరావతిలో పంటల దగ్ధమైన ఘటనలో వైయస్ జగన్ పేరు చెప్పాలని ఆయనపై పోలీసులు తీవ్ర ఒత్తిడి చేసి హింసించారు. అయినా ఆయన లొంగలేదు. ఆ విషయం తెలిసిన జగన్ తదుపరి సురేష్ కు ఎంపీ టిక్కెట్ ఇచ్చి గెలిపించారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఆయన కేసులు ఎదుర్కోవలసి వస్తోంది. మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై ఒక మహిళతో కేసు పెట్టించారు. ఆసక్తికరంగా ఆ మహిళ తనతో అధికార పార్టీ నేతలు కొందరు ఒత్తిడి చేసి తప్పుడు కేసు పెట్టించారని అఫిడవిట్ దాఖలు చేశారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఏపీలో ఉన్న పేకాట క్లబ్‌లు నడుస్తున్న తీరును విమర్శిస్తూ మంత్రి లోకేష్ పై ఆరోపణలు చేశారు. లోకేష్ దీనిని ఖండించి ఉండవచ్చు. అలా కాకుండా ఏకంగా ఆయనపై పోలీసులు కేసు పెట్టేశారు. ఇదే ప్రామాణికంగా తీసుకుంటే లోకేష్ అప్పటి సీఎం. జగన్ పైతో సహా పలువురు వైయస్ఆర్‌సీపీ వారిపై తీవ్రమైన ఆరోపణలు అనేకం చేసేవారని, అప్పట్లో తాము ఇలా కేసులు పెట్టలేదని వైయస్ఆర్‌సీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అలాగే నందిగామలో ఎప్పుడో చంద్రబాబు టూర్ లో జరిగిన చిన్న గొడవ మీద మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు , ఎమ్మెల్సీ అరుణకుమార్ లపై కేసులు పెట్టారు. మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్ పై కూడా హత్య కేసు బనాయించారని వైయస్ఆర్‌సీపీ ఆరోపించింది. వీరంతా దళిత నేతలే. దళిత నాయకత్వాన్ని దెబ్బతీయడానికే టీడీపీ ఇలా చేస్తోందని వైయస్ఆర్‌సీపీ విమర్శిస్తోంది. గతంలో ఒక కానిస్టేబుల్ పైనే సీబీఐ విచారణకు ఆదేశించిన న్యాయ వ్యవస్థ, ఇంతమంది దళిత నేతల విషయాలలో కూడా న్యాయం చేయాలని, తద్వారా పౌర హక్కులను కాపాడాలని పలువురు కోరుతున్నారు. అధికార వ్యవస్థపై కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష కట్టి పలు వేధింపులకు పాల్పడుతోంది. వీరిలో ఎక్కువమంది దళిత అధికారులు ఉండడం గమనించదగ్గ అంశం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 201419 మధ్య జరిగిన స్కిల్ స్కామ్‌తోసహా పలు కుంభకోణాలలో వైయస్ఆర్‌సీపీ టైమ్‌లో ఆధార సహితంగా కేసులు పెట్టడమే వారు చేసిన తప్పు. దీన్ని మనసులో ఉంచుకుని వారిలో పలువురిని వేధిస్తున్నారు. సీనియర్ ఐపిఎస్ అధికారి సునీల్ కుమార్‌ను రకరకాలుగా వేధిస్తుండగా, పాల్ రాజు, జాషువా అనే ఇద్దరు అధికారులకు పోస్టింగ్ ఇవ్వడం లేదట. మరో సీనియర్ అధికారి విజయపాల్‌ను అరెస్టు చేసి జైలులో పెట్టారు. ఇందులో విశేషం ఏమిటంటే కుల, మత విధ్వేషాలు రెచ్చగొడుతూ నిత్యం టీవీలలో మాట్లాడిన అప్పటి వైయస్ఆర్‌సీపీ అసమ్మతి నేతపై కేసు పెడితే, దానిని డైవర్ట్ చేసి, ఆయనను విచారణలో హింసించారంటూ కొత్త కేసును ముందుకు తీసుకురావడం. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ఎలాంటి హింస లేదని సర్టిఫికెట్ ఇచ్చినా, కూటమి అదికారంలోకి వచ్చాక, మొత్తం కేసును తిరగతోడి, ఐపిఎస్ అధికారులను ఇబ్బంది పెడుతున్నారు. వారిని లొంగదీసుకునివైఎస్సార్‌సీపీ నేతలపై కూడా కక్ష సాధించాలన్నది వీరి ప్లాన్ గా చెబుతున్నారు. అలాగే ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణ మార్గదర్శి కేసును విచారించి పలు అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. మార్గదర్శిలో రూ. 800 కోట్ల నల్లధనం ఉందని, మార్గదర్శి చిట్స్ లో పలు అక్రమాలు జరుగుతున్నాయని ఆధారాలు చూపుతూ ఫిర్యాదు చేయడమే ఆయన చెసిన తప్పు. ఇప్పుడు దానికి ప్రతిగా ఏదో రకంగా ఆయనను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ప్రభుత్వ దౌర్జన్యాలకు గురి అవుతున్నవారిలో పలువురు దళిత కార్యకర్తలు కూడా ఉన్నారు. రాజమండ్రిలో ఒక దళిత సోషల్ మీడియా యాక్టివిస్ట్ ను స్టేషన్ కు తీసుకువెళ్లి అర్ధనగ్నంగా నిలబెట్టి అవమానించారట. ఆ విషయాన్ని అతనే మాజీ ఎంపీ భరత్ సమక్షంలో వివరించారు. వైయస్ జగన్ పాలన సమయంలో ఒక దళిత డాక్టర్ సస్పెన్షన్ నే అంతగా రాజకీయంగా వాడుకున్న చంద్రబాబు,పవన్ కళ్యాణ్ తదితరులు ఇప్పుడు ఇంతమంది దళితులపై ఈ స్థాయిలో జరుగుతున్న దాష్టికాలకు బాధ్యత వహించరా?