రాజధాని రైతులతో బాబు చెలగాటం

రాజధాని రైతుల దగ్గరకొస్తానని ప్రకటించాడు చంద్రబాబు. రావడానికి వీల్లేదంటూ బదులిచ్చారు రైతులు. రాజధాని పేరుతో రైతుల గొంతు కోసి ఇవాళ కపట నాటకాలా అంటూ కన్నెర్ర చేస్తున్నారు.
గత చంద్రబాబు ప్రభుత్వానికి రైతులకు మధ్య ఆర్థిక ఒప్పందం జరిగింది. ప్రపంచస్థాయి రాజధాని కడతానని మాటిచ్చి రైతుల నుంచి భూ సేకరణ చేసింది నాటి బాబు సర్కార్. అన్ని ప్రాంతాలకూ సమాన దూరమైన ప్రాంతం అని రైతులను నమ్మబలికింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మాణాలనీ, మీరు భాగస్వాములు కావాలని చెప్పి భూములిచ్చేందుకు ఒప్పించింది. నిరాకరించిన రైతులను కూడా బెదిరింపులతో వేధించింది. మంత్రులు, అధికారులు, నేతలు ఇంటింటికీ తిరిగి మరీ భూములివ్వాలని కోరారు. ఐదేళ్లలో అద్భుత రాజధాని అనే కలలు చూపించారు. బదులుగా కమర్షియల్ ఫ్లాట్లు అన్నారు. లాండ్ పూలింగ్ లో పంటలు పండిచుకునే భూమి పోయి రైతులు, ఉపాధి కోల్పోయి కూలీలు నష్టపోయారు. చివరకు పరిహారం దక్కక, వ్యవసాయం పోయి దిక్కుతోచక రాజధానికి భూములు త్యాగం చేసిన రైతులు ఆగ్రహంతో చంద్రబాబును శాపనార్థాలు పెడుతున్నారు. ఐదేళ్లు రాజధాని రైతులను మోసం చేసిన చంద్రబాబు ఏ ముఖంతో ఇక్కడ కాలు పెడతారని ప్రశ్నిస్తున్నారు.
రాజధాని రైతులకు సీఎం జగన్ భరోసా
వీలైనంత త్వరగా రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లను అభివృద్ధి చేసి వారికి అందించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. సీఆర్‌డిఎ చేపట్టిన నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా తెలియజేసారు. 

Read Also: విభజన కంటే.. బాబు హయాంలోనే ఎక్కవ నష్టం

 

Back to Top