తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(మీడియా)గా పూడి శ్రీహరిని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. పూడి శ్రీహరి వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి చీప్ పీఆర్‌వోగా విధులు నిర్వహించారు.