

















వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి
విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బడుగు, బలహీనవర్గాల హృదయాల్లో చిరస్థాయిలో నిలిచిపోతారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అన్నారు. సీఎం వైయస్ జగన్ బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరుగుతున్న మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమానికి ఎమ్మెల్సీ జంగా పాల్గొని మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్ ప్రవేశపెట్టిన పథకాలు రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేస్తున్నాయన్నారు. జ్యోతిరావు పూలే, అంబేడ్కర్ అణచివేయబడిన జాతుల కోసం పోరాటం చేశారన్నారు. జ్యోతి రావు పూలే సామాజిక ఉద్యమ నేత అని కొనియాడారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డిని అభినవ అంబేడ్కర్ అని ఆనాడు అన్నారని, ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, పూలే, వైయస్‌ఆర్ ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశంతో బీసీ వర్గాలను ఆదుకుంటున్నారన్నారు. పాదయాత్రలో తెలుసుకున్న కష్టాలను చూసి బీసీ డిక్లరేషన్ ప్రకటించారన్నారు. బీసీల అభివృద్ధికి పాటుపడుతున్న సీఎం వైయస్ జగన్‌కు జంగా కృతజ్ఞతలు తెలిపారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్‌లు కల్పించాలని రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టిన ఏకైక పార్టీ వైయస్‌ఆర్ సీపీ అని ఎమ్మెల్సీ జంగా గుర్తుచేశారు. వైయస్ జగన్ శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. అనేక చట్టాలు తీసుకువచ్చారన్నారు. సీఎం వైయస్ జగన్ బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి అని, మరో చరిత్ర సృష్టిస్తారన్నారు.
Read Also: పూలే విగ్రహానికి నివాళులర్పించిన సీఎం వైయస్ జగన్