వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సీఎం వైయస్ జగన్ భేటీ
గడప గడపకూ మన ప్రభుత్వంపై సమీక్ష
హాజరైన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు
తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు నియోజకవర్గ సమన్వయకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు. రానున్న రోజుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలకు సీఎం వైయస్ జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు.