శ్రీకాకుళం: తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని, వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో వ్యవసాయం చేయడం అంటే పండుగ చేసుకోవడంలాంటిదని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. సింగుపురంలో రైతు రూ.26.80 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. రైతులకు ఖరీఫ్ సీజన్ 2023 రాయితీపై విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ..రైతులకు ఎన్ని సహాయ సహకారాలు అందించిన తక్కువే. దేశంలో ఏ రాష్ట్రం కూడా మన వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తున్న విధంగా ఎక్కడా సహాయం చేయడం లేదు. వ్యవసాయదారులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం మనది. వారిని లాభాల బాట పట్టించేందుకు ఆర్థికంగా పెద్ద ఎత్తున సహాయం చేస్తున్న ప్రభుత్వం మనది. సాగుదారులకు ప్రభుత్వం చేస్తున్న సహకారం గుర్తించి అండగా ఉండాలి. మేలు చేసే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారం చేపట్టిన తరువాత ఈ నాలుగేళ్లలో గతంలో ఏ ప్రభుత్వాలు చేయనన్ని పనులు చేస్తున్నాము. గ్రామంలోనే అని కార్యాలయాలూ ఏర్పాటు చేశాం. పరిపాలనను మరింత చేరువ చేస్తూ గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి,బలోపేతం చేశాం. గతం ప్రభుత్వం హయాంలో జన్మ భూమి కమిటీ సభ్యులు చెప్పిన వారికే ఎరువులు అందేవి. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అందరికీ రైతులకు మీ ఇంటి దగ్గరే ఎరువులు అందిస్తున్నాము. మధ్యవర్తి ప్రమేయం లేకుండా పంట కొనుగోలు చేస్తున్నాము. రైతులకు ఏంతో ప్రయోజన కారణమైన పనులు చేపట్టాం. 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, గొట్ట బ్యారేజ్ దగ్గర లిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నాం, వంశధార గొట్టా బ్యారేజీ దగ్గర ఎత్తిపోతల పథకం పూర్తి అయితే మండు వేసవిలో కూడా నీరు అందిస్తాం. దీంతో గ్రామాల్లో పారుతున్న గెడ్డలు ఎండిపోవు. రానున్న రోజుల్లో రైతులకు మహర్దశ పట్టనుంది. ఇక అంపోలు వ్యవసాయదారులకు సంబందించిన లాబ్ ఏర్పాటు చేస్తున్నాం. వ్యవసాయ దండగ, ఉచితంగా కరెంట్ ఇవ్వలేం అన్నది ఆ రోజు విపక్ష నేత చంద్రబాబు. మరి ఈ రోజు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం.. వ్యవసాయ రంగం కోసం గొప్ప గొప్ప ఆలోచన చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ ఒక్కరే.చిన్న చిన్న విషయాలు కూడా గమనించి, ఏం చేస్తే మంచి జరుగుతుందో ఆలోచనా చేస్తున్న ఏకైక సీఎం జగన్.. అని మంత్రి ప్రసాదరావు పేర్కోన్నారు. జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, ఎంపిపిలు అంబటి నిర్మల శ్రీనివాస్, గోండు రఘురాం, జడ్పీటిసి రూప్పా దివ్య, సర్పంచ్ గుండ ఆదిత్య నాయుడు, ఎఎంసి చైర్మన్ ముకళ్ల తాత బాబు, ఎంపిటిసిలు బగ్గు అప్పారావు, నక్క శంకర్, మాజీ సర్పంచ్ గుండ మోహన్ రావు, అరవల రామ కృష్ణ, చంద్ర మౌళి తదితరులు పాల్గొన్నారు.