వైయ‌స్ జగన్ ప్రజల మనిషి

ఆయన నిత్యం ప్రజలతోనే మమేకం

అయినా ఈనాడు బురద కథనం

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్‌

వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రెస్‌మీట్‌

తాడేపల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల మ‌నిషి అని మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు.  ఈ నెల 15 నుంచి జగన్‌మోహన్‌రెడ్డిగారు ప్రజాదర్బార్‌ నిర్వహిస్తారంటూ ఈనాడులో ఒక బురద కథనం రాశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆక్షేపించారు. నిత్యం వైయ‌స్ జగన్‌గారిపై విషం చిమ్ముతూ.. చంద్రబాబును మోయడమే ఈనాడు లక్ష్యమని ఆయన  తెలిపారు. నిజానికి వైయ‌స్ జగన్‌గారు అంటే జనం.. జనం అంటే జగన్‌గారు అని శ్రీ అంబటి తేల్చి చెప్పారు. వైయ‌స్ జగన్‌గారు నాడు–నేడు కానీ, అప్పుడైనా, ఇప్పుడైనా కానీ.. ప్రజల మనిషి అని స్పష్టం చేశారు.

ఏనాడూ దూరంగా లేరు:
    వాస్తవానికి జగన్‌గారు ఏనాడూ జనానికి దూరంగా లేరని అంబటి రాంబాబు వెల్లడించారు. చంద్రబాబు ఇప్పటి వరకు తన జీవితంలో ఎంత మందిని కలిశారో.. అంతకన్నా 10 రెట్లు ఎక్కువ మందిని జగన్‌గారు కలిశారని తెలిపారు. రోజూ ప్రజల మధ్య ఉంటూ అందరితో మమేకమయ్యే మనిషి వైయ‌స్ జగన్‌ అని చెప్పారు.

కోకొల్లలుగా ఘటనలు:
    
జగన్‌గారు తన పర్యటనల్లో బస్సులో వెళ్తుంటే, రోడ్డుపై ఎవరైనా కాగితం పట్టుకుని చెయ్యి పైకెత్తితే చాలు.. వెంటనే బస్సును ఆపేసి వారిని కలుసుకుంటారని అంబటి గుర్తు చేశారు. అలా ఎందరో బాధలను ఆయన తీర్చారని, దీనికి సంబంధించి, ఎన్నెన్నో ఘటనలు ఉన్నాయని తెలిపారు.
    ‘వైయ‌స్ జగన్‌గారిని కలుసుకునేందుకు మేము జనాలను తీసుకురావాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు.. వారే తండోపతండాలుగా వస్తున్నారు’.. అని  అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

ఇప్పుడూ కలుస్తున్నారు:
    వైయ‌స్ జగన్‌గారు ఇప్పుడు కూడా క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రతి రోజూ ఉ. 10 గం. నుంచి మధ్యాహ్నం 2.30 గం.ల వరకు అందరినీ కలుస్తున్నారని.. ప్రతి ఒక్కరిని ఓపికతో పలకరిస్తున్నారని, వారితో మాట్లాడుతున్నారని  మాజీ మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. నాయకులతో పాటు, సామాన్యులను కూడా ఆయన కలుస్తున్నారని చెప్పారు. 
    అందుకే ఇలాంటి పిచ్చి రాతలు రాసి, ఏదో ఒక విధంగా జగన్‌గారిని అభాసుపాలు చేసే ప్రయత్నం మానుకోవాలని మాజీ మంత్రి  అంబటి రాంబాబు.. ఈనాడు పత్రికకు హితవు చెప్పారు. 

Back to Top