పెన్షన్ అడ్డుకున్న చంద్రబాబు కూటమికి ఓటమి తప్పదు 

మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు   

తాడేప‌ల్లి: ఇంటికి వచ్చే పెన్షన్ అడ్డుకున్న చంద్రబాబు కూటమికి ఓటమి తప్పద‌ని మాజీ మంత్రి రావెల కిశోర్బాబు హెచ్చ‌రించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 66 లక్షల మంది పెన్షనర్ల కష్టాలకు బాధ్యత చంద్రబాబుదే అన్నారు. శుక్ర‌వారం రావెల కిశోర్ బాబు మీడియాతో మాట్లాడారు.

రావెల కిషోర్‌బాబు ఏమ‌న్నారంటే..

  • పెన్సన్లను బ్యాంక్ అకౌంట్లలో వేయమంది చంద్రబాబు తరపున ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ రమేషే.
  • ఆర్ధికంగా లిగిపోయిన చితికిపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటే చంద్రబాబు చూసి ఓర్వలేక ఇబ్బందులు పెడుతున్నారు.
  • ప్రస్తుత దుస్ధితికి కారణం చంద్రబాబే అని తెలిసినా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పచ్చమీడియా విషం చిమ్ముతోంది.
  • రోజూ బ్యానర్ ఐటమ్స్ తో చంద్రబాబుతో అంటకాగుతూ పత్రికాస్వేఛ్చను దుర్వినియోగం చేస్తున్నారు
  • పెన్షనర్లకు, వైయస్ జగన్ కు మధ్య గ్యాప్ రావాలని,తేవాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు.
  • ఒక రాజకీయ కుట్రలో నిమ్మగడ్డ రమేష్ తో కలిసి వాలంటీర్ లు పెన్షన్ పంచడానికి వీల్లేదని కోర్ట్ డైరెక్షన్ తీసుకు వచ్చారు
  • చాలా మందికి బాంక్ అక్కౌంట్లు లేవు వారంతా ఇబ్బందులు పడుతుంటే బ్యాంకుల దగ్గర క్యూలలో నిలుచోలేక వృధ్దులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
  • గత నాలుగున్నరేళ్లుగా ఇంటికే పెన్షన్ ఇవ్వడం వల్ల బాంక్ అక్కౌంట్లు అందుబాటులో లేవు
  • ఇంటికి వచ్చే పెన్షన్ అడ్డుకున్న చంద్రబాబు కూటమికి ఓటమి తప్పదు.
  • నవరత్నాలు పై కుట్రలు చేస్తూ నవదందాలు అంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు..
  • -  చంద్రబాబూ....మీకు ప్రజలు బుద్ది చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి..మీకు ఓటమి తప్పదు.
  • పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటీషియన్....పవన్ కళ్యాణ్ మాటలకు అర్ధం లేదు
  • పరుష పదజాలంతో జగన్ గారిని వ్యక్తిగతంగా తిట్టడం ద్వారా పవన్ కళ్యాణ్ దిగజారి వ్యవహరిస్తున్నారు..
  • పవన్ కళ్యాణ్ వి అపరిపక్వ రాజకీయాలు.. నీతి లేని రాజకీయాలు.
  • గత ఎన్నికలలో లాగానే ఈ ఎన్నికలలో కూడా పవన్ కళ్యాణ్ కి రాజకీయ పతనం తప్పదు.
     
Back to Top