చిత్తూరు: ‘మా వీధుల్లో మీరు తిరగకూడదు.. మా ముందు చెప్పులు వేసుకుని నడవకూడదు.. దళితులు ఊర్లోనే ఉండకూడదు.. ఖాళీచేసి వెళ్లిపోండి’.. అంటూ నగరి మండలం తడుకుపేటలో టీడీపీ నేతలు దళితులపై దాడి చేయడాన్ని మాజీ మంత్రి తీవ్రంగా ఖండించారు. అధికారం శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలంటూ టీడీపీని హెచ్చరిస్తూ ఆమె ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. దళితులను ఊళ్లో రానివ్వమని, తిరగకూడదని, ఊరి నుండి వెలి వేయాలని హుకుం జారీ చేస్తున్న తెలుగు దేశం నాయకులు చూడండి, దళితులపై భౌతికంగా దాడి చేసి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసి వాళ్ళ మీదే రివర్స్ కేసు పెట్టడం ఇదెక్కడి న్యాయం? దాడికి పాల్పడ్డ వంశీ, కిరణ్, పురుషోత్తం లను వెంటనే అరెస్టు చేయిస్తే నారా లోకేష్ మాటకి గౌరవం పెరుగుతుంది, అంతే గానీ అధికారం ఉందని ఇలా బాధితులపై దాడులు చేస్తే మానవజాతి క్షమించదు ..అధికారం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోండి!! అంటూ రోజా ట్వీట్ చేశారు.