రామోజీ..నీ రాతలకు కాలం చెల్లింది 

మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు 

తాడేప‌ల్లి: ఈనాడు అధినేత రామోజీ రావు రాతలకు కాలం చెల్లింద‌ని, ప్రజలు తిరుగుబాటు చేసే సమయం వచ్చింద‌ని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు హెచ్చ‌రించారు.  ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై తెలుగుదేశం పార్టీ పచ్చమీడియా కలసి కుట్రపూరిత దుష్ప్రచారానికి ఒడిగట్టాయ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అబద్దాలను,అసత్యాలను పదే పదే ప్రచారం చేస్తున్నాయి.కుట్రపూరిత రాజకీయవిధానాన్ని అనుసరిస్తున్నాయి.  బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నాయి.ప్రజలు కూటమిని అసహ్యించుకుంటున్నారు. ఓటమి భయంతో ప్రజలను తప్పుదారిపట్టిస్తూ ప్రజలను వైయ‌స్ఆర్‌సీపీకి దూరం చేయాలనే ఇలా చేస్తున్నారు.  రామోజీరావు అబద్దాలను నిజాలని నమ్మేంతగా రాతలు రాస్తూ ప్రజలలో భయాన్ని క్రియేట్ చేస్తున్నారు.  నీ రాతలకు కాలం చెల్లింది.ప్రజలు తిరుగుబాటు చేసే సమయం వచ్చిందని హెచ్చ‌రించారు.

అభూత కల్పనలు లేని సమస్యలు గురించి కొన్ని పాత్రల ద్వారా చెప్పిస్తూ అబద్దాలను ప్రచారం చేస్తున్నారు. లేనిది ఉన్నట్లు,ఉన్నది లేనట్లుగా తప్పుదోవ పట్టిస్తున్నారు.  అధికార కాంక్షతో చేస్తున్న  ఈ కుట్ర రాజకీయాలకు తెరలేపారు.  1908 రిజిస్ర్టేషన్ చట్టం తర్వాతా మార్పులకు అనుగుణంగా చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈరోజు ఈ చట్టం గురించి ఆలోచన జరుగుతోంది.  నీతిఅయోగ్ సూచనల మేరకు చట్టం రూపకల్పన జరుగుతోంది.

 భూములను దోచుకుంటున్నారు...భూములు కబ్జా అవుతాయి. ఎవరో ఎత్తికెళ్లిపోతున్నారంటూ ప్రజలలో భయోత్పాతాలు సృష్టిస్తున్నారని రావెల కిషోర్‌బాబు ఫైర్ అయ్యారు.  నిజానికి ఈ చట్టం ద్వారా ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది.సంపూర్ణ హక్కులు లభిస్తాయి.  టిడిపి కూటమి చెప్పే మాయమాటలు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.  ప్రజల హృదయాలలో స్దానం సంపాదించిన జగన్ గారిని గెలిపించేందుకు ప్రజలు నిర్ణయించుకున్నారు.

Back to Top