రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతికత చంద్రబాబుకు లేదు

వైయ‌స్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి

బాబు పాలనంతా కరువు కాటకాలు..దారిద్య్రం తాండవించాయి

హంద్రీనీవాకు రెండుసార్లు శంకుస్థాపన చేసి మోసం చేసింది నీవు కాదా

నాడు ప్యాకేజీ కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన ఘనత మీదే

వైయ‌స్ఆర్ కృషితోనే రైతులకు హంద్రీనీవా ఫలాలు

 రైతుల సంక్షేమానికి లక్ష 90 వేల కోట్లు ఖర్చు చేసిన ఘనత వైయ‌స్‌ జగన్ దే.

ఉరవకొండ:  రాయలసీమ నుంచి గెలిచి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు కానీ, ఆయనను సమర్థిస్తున్న దుష్ట చతుష్టయానికి ఇక్కడి ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని వైయ‌స్ఆర్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు, ఏనాడూ ఎక్కడా ఒక్క సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయకపోగా 40 టీఎంసీల హంద్రీనీవా ప్రాజెక్టును 4 టీఎంసీలకు కుదించి రెండు సార్లు శంకుస్థాపన చేసి గంపెడు మట్టి కూడా తీయలేదని మాజీ ఎమ్మెల్యే విమర్శించారు.గురువారం విడపనకల్లు మండలం పొలికి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. 

సీమ ప్రాజెక్టులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.చంద్రబాబు పాలనలో ప్యాకేజి కోసం అప్పటి కేంద్ర ప్రభుత్వంతో రాజీ పడడం వల్ల రాష్ట్రానికి రావాల్సిన హామీలు నెరవేరకుండా పోయాయన్నారు.హంద్రీనీవా పేరుతో రాయలసీమ ప్రజలను మోసం చేసిన ద్రోహి చంద్రబాబని రెండుసార్లు హంద్రీనీవాకు శంకుస్థాపన చేసి పనులు చేపట్టకుండానే ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు.దివంగత ముఖ్యమంత్రి వైస్సార్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేప్పట్టిన తరువాత హంద్రీనీవాకు వేల కోట్లు నిధులు కేటాయించి మొదటి దశ పనులు పూర్తి చేసి రెండవ దశ పనులు కూడా ప్రారంభించిన గొప్ప నాయకులు వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అని కొనియాడారు.

 వైయ‌స్ఆర్‌  అంటే హంద్రీనీవా..హంద్రీనీవా అంటే వైయ‌స్ఆర్‌ అన్న రీతిలో దాన్ని సాకారం చేసారని వెల్లడించారు.చంద్రబాబు పాలనలో సాగునీటి ప్రాజెక్టులు అన్ని పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని సాగునీటి ప్రాజెక్టులపై బాబు ద్వంద వైఖరి అవలంబించారని చెప్పారు.14 ఏళ్ల బాబు పాలనంతా కరువు.. కాటకాలు తాండవించాయని రైతులకు దారిద్య్రం వెంటాడిందన్నారు.అప్పట్లో కేంద్రం నుంచి డబ్బులు తెచ్చుకోవడగానికి మాత్రమే రాయలసీమ పేరును చంద్రబాబు వాడుకున్నారని రాయలసీమ బిడ్డగా చంద్రబాబు ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదన్నారు. 

నాటి పాలనలో రైతు ఆత్మహత్యల కేరాఫ్ గా ఆంద్రప్రదేశ్ మారిందని రైతుల ఆత్మహత్యలపై చంద్రబాబు తన అధికారంలో ఒక కమిషన్నీ కుడా వేయలేకపోయారన్నారు. వైయ‌స్ఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసి ఆత్మహత్యలపై ఒక కమిషన్ కూడా వేశారన్నారు.

 వైయ‌స్ఆర్‌ రైతుల కోసం సంక్షేమానికి రెండగులు ముందుకేస్తే ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి నాలుగు అడుగులు ముందుకేస్తూ అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అంతేకాక వైయ‌స్ జగన్ పాలనలో రైతుల సంక్షేమానికి ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, అన్ని పంటలకు బీమా ప్రీమియం చెల్లింపు, తదితర వాటి కోసం రూ.1 లక్ష 90 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. వైయ‌స్ జగన్ పాలనలో రైతులు ఎంతో ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో ఉన్నారన్నారు. రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడానికి దాదాపు 8 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టినట్లు పేర్కొన్నారు.ఎన్నికలు సమీపిస్తున్న వేళా ప్రజలను, రైతులను మోసం చేయడానికి చంద్రబాబు మాయమాటలతో మభ్యపెడుతున్నాడని విమర్శించారు.

చంద్రబాబు మాటలను ప్రజలను నమ్మే పరిస్థితి లేదన్నారు.తానొక్కడే ప్రజల మనుసు గెలుచుకోలేనని తెలుసుకున్న బాబు ఎల్లోమిడియాను అడ్డుపెట్టుకు ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయిస్తూ విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుయుక్తులను.. ఎల్లోమిడియా విష ప్రచారాన్ని ప్రజలు విశ్వసించరని వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపిపి కరణం పుష్పావతి,జెడ్పిటిసి హనుమంతు, సర్పంచ్ బోయ నాగమ్మ, ఉప సర్పంచ్ శ్రీనివాసులు, ఉరవకొండ వైస్ ఎంపిపి నరసింహులు, కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ గోవిందు, జేసిఎస్ మండల కన్వీనర్ భరత్ రెడ్డి, నాయకులు భీమరెడ్డి, మాజీ జెడ్పిటిసి తిప్పయ్య, విడపనకల్లు సుంకన్న, గిరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Back to Top