న‌ర్సీప‌ట్నం వైయ‌స్ఆర్‌సీపీలోకి భారీగా చేరికలు

అన‌కాప‌ల్లి:  న‌ర్సీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గం మాక‌వ‌రం మండ‌లంలో టీడీపీకి షాక్ త‌గిలింది. బూరుగుపాలెం గ్రామానికి చెందిన‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామా­జిక వర్గాలకు చెందిన 100 కుటుంబాలు టీడీ­పీని వీడి  బుధ‌వారం ఎమ్మె­ల్యే గ‌ణేష్ సమక్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి.  బూరుగుపాలెం టీడీపీ సర్పంచ్,ప‌లువు­రు యువత  వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.   ఈ సంద‌ర్భంగా గ‌ణేష్ మాట్లాడుతూ.. చంద్ర‌బాబువి అరచేతిలో వైకుంఠం చూపించే మాటలని కూటమిలోని బీజేపీ దూరం జరిగింద‌న్నారు. కూటమి మేనిఫెస్టోలో కనిపించింది మూడు కాదు.. రెండు ఫొటోలే. కూటమి సర్కస్‌ మొదలైంది అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ చెప్పేసింది. 2014 మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఎన్ని నెరవేర్చారు. రైతు రుణమాఫీ చేస్తామన్నారు చేశారా?. ఇన్ని హామీలిచ్చాం.. ఇన్ని నెరవేర్చామని చెప్పే ధైర్యం కూడా లేదు. ఇద్దరు మోసగాళ్లకు పాత మేనిఫెస్టో చూపించే సత్తాలేదు. రాష్ట్రాన్ని ఉద్దరించడానికి కాదు.. అధికారం కోసమే ముగ్గురూ కలిశారు. రాష్ట్రాన్ని బాగు చేయడానికి మేనిఫెస్టోలో ఏం పెట్టారు? అని  గ‌ణేష్  ప్రశ్నించారు. మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను సీఎం వైయ‌స్ జగన్‌ నెరవేర్చార‌ని గ‌ణేష్‌ పేర్కొన్నారు. మ‌ళ్లీ జ‌గ‌నన్న‌ను ముఖ్య‌మంత్రిని చేసుకుంటునే న‌వ‌ర‌త్నాల ప‌థ‌కాలు కొన‌సాగుతాయ‌ని చెప్పారు.

Back to Top