సీఎం వైయస్‌ జగన్‌ పారదర్శక పాలనకు ప్రజలు ఓటేశారు

మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌

మూడు రాజధానులకు ప్రజల ఆమోదం లభించింది

చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు బుద్ధి చెప్పారు

పంచాయతీ ఫలితాలకు మించి మున్సిపల్‌ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ విజయం

గడప వద్దకే సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం

విద్య, వైద్య రంగాల్లో అనేక మార్పులు తీసుకొచ్చాం

చంద్రబాబు తీర్పుపై సమీక్షించకుండా ప్రజల్ని తిడుతున్నారు

తాడేపల్లి:  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సంక్షేమ పాలనకు ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని, పారదర్శక పాలనకు ప్రజలు ఓట్లు వేశారని మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ పేర్కొన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు.  పంచాయతీ ఎన్నికల ఫలితాలకు మించిన విజయం మున్సిపల్‌ ఎన్నికల్లో దక్కిందన్నారు. ఈ ఎన్నికల్లో రికార్డు  విజయాన్ని ప్రజలు అందించారన్నారు.  ప్రజలే చంద్రబాబును పీకి పక్కన పడేశారని చెప్పారు. సోమవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అనిల్‌కుమార్‌యాదవ్‌ మీడియాతో మాట్లాడారు. 

రాష్ట్రంలోని 75 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించగా 74 మున్సిపాలిటీలు వైయస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. వార్డుల్లో 84 శాతం మా పార్టీ అభ్యర్థులే గెలిచారు. కేవలం టీడీపీకి 12 శాతమే. పంచాయతీలకన్నా కూడా అర్బన్‌లో వైయస్‌ఆర్‌సీపీ అద్భుతమైన రిజల్ట్‌ వచ్చింది. సంక్షేమం  ఒకవైపు, అభివృద్ధి మరో వైపు జరిగింది. దీన్ని చూసి కనీవిని ఎరుగని రీతిలో అర్బన్‌ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీకి కట్టబెట్టారు. వైయస్‌ జగన్‌ పరిపాలనలో ఈ రోజు ఎక్కడో రాజధానిలో ఉండే సెక్రటేరియట్‌ను గ్రామస్థాయికి తీసుకువచ్చారు. పరిపాలనను ప్రజలకు దగ్గరకు తెచ్చిన వైయస్‌ జగన్‌కు ప్రజలు ఇవాళ పట్టం కట్టారు. ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు నేరుగా గడప వద్దకే చేర్చుతున్నాం.

గ్రామంలోనే 10 మంది అధికారులను అందుబాటులో ఉంచారు. గ్రామానికి వెళ్తే ఒక సెక్రటేరియట్, అక్కడి నుంచి నాలుగు అడుగులు వేస్తే ఇంగ్లీష్‌ మీడియం స్కూల్, హెల్త్‌ సెంటర్, ఆర్‌బీకే వంటి అనేక మార్పులు కనిపిస్తాయి.  విద్యలో నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోయాయి. వైద్యంలో 108, 104 వాహనాలు అందుబాటులోకి తెచ్చారు. 2500 వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి అందుబాటులోకి తెచ్చారు. నాడు–నేడు ద్వారా ఆసుపత్రుల్లో అభివృద్ధి కార్యక్రమాలు. 16 కొత్త మెడికల్‌ కాలేజీలు తీసుకువస్తున్నాం. 

రాష్ట్రంలో కొత్తగా మూడు పోర్టులు, నాలుగు ఫిషింగ్‌ హర్బర్స్‌ తీసుకువచ్చారు. ఇరిగేషన్‌కు సంబంధించిన రాయలసీమ ఎత్తిపోతల, ప్రకాశం నుంచి రెండు బ్యారేజీలు, వంటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా 84 శాతం వార్డులు, వంద శాతం కార్పొరేషన్లు దక్కించుకున్నాం. వైయస్‌ జగన్‌పై నమ్మకం నిజమైంది. మూడు రాజధానులకు ప్రజలు మద్దతు తెలిపారు. 

ఎక్కడా కూడా వైయస్‌ జగన్‌ పనే మాట్లాడింది. తన పని తాను చేసుకుంటూ..ఎక్కడా కూడా ఆర్భాటాలు లేకుండా, ఏ ఒక్క కార్యక్రమం కూడా ప్రజలకు నేరుగా అందజేశారు. లోకల్‌ గవర్నెన్స్‌కు పెద్ద పీట వేశారు. దేశంలోనే రాష్ట్రంలో మొట్ట మొదటిసారి వైయస్‌ జగన్‌ లోకల్‌ గవర్నెన్స్‌ తెచ్చారు. ప్రశాంత వాతావరణంలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించారు. ఇందుకు ప్రజలకు, అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ఎంత దిగజారుడు స్థాయిలో మాట్లాడారో చూశాం. ప్రజలను అవమానించేలా సిగ్గు ఉందా? రోషం ఉందా అని చంద్రబాబు రెచ్చగొట్టారు. ఈ ఎన్నికల్లోనే చంద్రబాబుకు బుద్ధి చెప్పేలా ఓటర్లు తీర్పు ఇచ్చారు.

చంద్రబాబు శాశ్వతంగా హైదరాబాద్‌కే మకం మార్చారు. ఆయన కుమారుడు లోకేష్‌ ఏం పీకారని మాట్లాడారు. ప్రజలే మిమ్మల్ని పీకి పక్కన పారేశారు. 2019లో మిమ్మల్ని పీకేసినా బుద్ధి మారలేదు. లోకల్‌ బాడీలో రెట్టింపు అభిమానంతో ప్రజలు వైయస్‌ జగన్‌కు ఓట్లు వేశారు. సీఎం వైయస్‌ జగన్‌పై రెట్టింపు బాధ్యత పెంచారని ముఖ్యమంత్రి ట్వీట్‌ చేశారు. అదే చంద్రబాబు, ఆయన కుమారుడు ప్రజలను తిట్టే పనిలో పడ్డారు. ప్రజల తీర్పును అవమానించేలా ప్రతిపక్ష నేతలు మాట్లాడుతున్నారు. వైయస్‌ జగన్‌పై నమ్మకంతో మున్సిపల్‌ ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చిన ప్రజలందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 

 

Back to Top