హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వాన్ని అతీతశక్తులు నడిపిస్తున్నాయని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైయస్ జగన్‌కు మించిన ఆప్షన్ లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు నచ్చే విధంగా టీడీపీ లేదని ఆయన విమర్శించారు. సమాజంతో సంబంధం లేని వ్యక్తులు చంద్రబాబును కలుస్తున్నారని తెలిపారు. రాజకీయంగా, సామాజికంగా చంద్రబాబు తనను ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు. టీడీపీకి రాజీనామా చేసిన ఆమంచి బుధవారం హైదరాబాద్‌లో వైయస్ జగన్‌ను కలిశారు. వైయస్ జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాలకు ఆకర్శితుడినై త్వరలోనే వైయస్‌ఆర్‌సీపీలో చేరుతానని ఆయన మీడియాకు వివరించారు. ఆమంచి మాట్లాడుతూ..దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిని దగ్గర నుంచి చూశామని, ఆయన పాలనలో అందరూ సంతృప్తి చెందారన్నారు. అలాంటి మహానేత కుమారుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమన్నారు. ప్రాణం పోయినా మాట తప్పని వ్యక్తి వైయస్ జగన్ అన్నారు. అలాంటి జననేతపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వైయస్‌జగన్ తప్ప మరోక ప్రత్యామ్నయం లేదన్నారు. ఏపీలో వైయస్ జగన్‌కు మించిన వేరే ఆప్షన్ లేదన్నారు. చంద్రబాబు నుంచి ఏపీని కాపాడుకోవాల్సి ఉందన్నారు. చంద్రబాబుకు 70 ఏళ్లు ఉంటాయని, ఆయనకు ఆల్జిమర్స్ చంద్రబాబు మాటలు చూస్తే పిచ్చిపట్టినట్లుగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంతో సంబంధం లేని వ్యక్తులు సీఎంను కలుస్తున్నారని విమర్శించారు. రాజకీయంగా సామాజికంగా తనకు ఇబ్బందులు కలిగించారని చెప్పారు. ఈ అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా సీఎం నివాసంలో ఆయన పేషిలో ఇతర వ్యక్తుల జోక్యం చేసుకున్నారని చెప్పారు. ఇలాంటి దారుణమైన చర్యలు భరించలేక వైయస్‌ఆర్‌సీపీలో చేరుతున్నానని చెప్పారు. స్థానికంగా నా ప్రత్యర్థి ఎవరైనా నాకు ఇబ్బంది లేదన్నారు. టీడీపీలో కుల పిచ్చి ముదిరిపోయిందని పేర్కొన్నారు. ఒక కులం గుత్తాధఙపత్యం గురించి ప్రయత్నం చేస్తుందన్నారు. కాపు రిజర్వేషన్లపై రాజకీయం చేయడం తగదన్నారు. తుని ఘటనలో మా అన్నపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. చంద్రబాబుకు 70 ఏళ్లు దాటాయని, ఆల్జీమర్స్ వచ్చాయనే అనుమానం ఉందన్నారు. ఈ రోజు ఒక మాట..రేపు మరోమాట చెబుతారని విమర్శించారు. హోదాపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని పేర్కొన్నారు. మనం ఏం చెప్పినా వింటారనే భ్రమలో చంద్రబాబు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుభవం ఉందని అధికారం ఇస్తే హైదరాబాద్ నుంచి పారిపోయారు రీజిన్ లేకుండా హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడన్నారు. చిన్న విషయం కోసం చంద్రబాబు హైదరాబాద్ వదులుకున్నాడని విమర్శించారు. ఏ ఉద్యోగిని అడిగినా అమరావతి కష్టాలు చెబుతారని తెలిపారు. పవన్‌తో అనేకసార్లు చర్చించాను కానీ..జనసేనలో చేరుతానని చెప్పలేదన్నారు. పార్టీ మారే ముందు మాజీ సీఎం రోశయ్య ఆశీస్సులు తీసుకున్నానని ఆమంచి తెలిపారు.