వైయ‌స్‌ జగన్ తో పెట్టుకుంటే ప్రజలు నిన్ను తొక్కి నారతీస్తారు..పవన్..!

వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి 

అసలు నీ రాజకీయ జీవితంలో నీకంటూ ఓ పేజీ ఉందా పవన్‌ కల్యాణ్‌?

చంద్రబాబు చేతిలో తోలుబొమ్మ పవన్‌ కల్యాణ్‌. 

దమ్ముంటే విశాఖలో ప్రజల ఆస్తులను లాక్కుంటున్న టీడీపీ దండుపాళ్యం బ్యాచ్ నారతీయ్..

ఉత్తరాంధ్ర సభల్లో మీరు విశాఖ స్టీల్‌ గురించి ఎందుకు మాట్లాడలేదు? 

దమ్ముంటే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ను రద్దు చేస్తామని మోడీతో చెప్పించు: ఎమ్మెల్సీ వరుదు కల్యాణి. 

 విశాఖ‌:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌తో పెట్టుకుంటే ప్ర‌జ‌లు నిన్ను తొక్కి నార తీస్తార‌ని  వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను హెచ్చ‌రించారు. మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 

నువ్వు బెదిరిస్తే బెదరడానికి ఇక్కడున్నది జగన్‌ అని గుర్తుపెట్టుకో పవన్‌:
– ప్రజలు జగనన్నకు బ్రహ్మరథం పడుతుంటే దాన్ని చూసి ఓర్వలేక, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.
– చంద్రబాబు, పవన్‌లు కూటమి కడితే ప్లాప్‌ అయ్యింది. దీంతో బీజేపీని కూడా కూటమిలోకి తెచ్చినా అది కూడా ప్లాప్‌ అయ్యింది. 
– వాళ్లు తీసుకొచ్చిన మేనిఫెస్టో కూడా అట్టర్‌ పాఫ్‌ అయ్యింది. 
– ఆ మేనిఫెస్టోకి మేం గ్యారెంటీ ఉండము అంటూ బీజేపీ చెప్పే పరిస్థితి చూశాం.
– వాళ్లు ఏది చేసినా ప్లాఫ్‌ అవ్వడంతో జగన్‌ గారిపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. 
– చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లో 2014–19 మధ్య ఏం చేశారో చెప్పి ఓట్లడిగితే బాగుంటుంది. 
– అది మానేసి నిన్న విశాఖ వచ్చిన పవన్‌ కల్యాణ్‌ మాటలు విని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
– మాట్లాడితే చెగువీరా పేరు చెప్పుకునే ఇతను, పెద్ద పెద్ద వాళ్లు నాకు స్ఫూర్తి అనే ఇతని నిజ స్వరూపం నిన్న విశాఖ ప్రజలు చూశారు. 
– సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని పట్టుకుని..‘నాకు తిక్కరేగితే...ముఖ్యమంత్రా..వాడెమ్మ మొగుడా అనేది గుర్తుకురాదు’ అంటున్నాడు. 
– అందర్నీ కూర్చోబెట్టుకుని ఆడిస్తున్నావ్‌ బిడ్డా..నీ సంగతి భవిష్యత్తులో తేలుస్తా అంటున్నారు.
– పవన్‌ కల్యాణ్‌...నువ్వు బెదిరిస్తే బెదరడానికి ఇక్కడున్నది జగన్‌ అనేది తెలుసుకో. 
– జగనన్న సోనియాగాంధీ, చంద్రబాబులకే బయపడలేదు. అలాంటిది నిన్ను చూసి బయపడతారా? 
– పార్టీ పెట్టిన 14 ఏళ్లలోనే 151 స్థానాలు సాధించి ముఖ్యమంత్రి అయ్యారు.
– ఈ 14 ఏళ్లలో ఎవరికీ తలవంచకుండా తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడుతున్న నాయకుడు వైఎస్‌ జగన్‌.
– మీరు పార్టీ పెట్టి పదేళ్లయినా..2014లో అసలు పోటీనే చేయలేదు. 
– 2019లో మీరు పోటీ చేసిన రెండు అసెంబ్లీ స్థానాల్లో కూడా ఓడిపోయిన చరిత్ర మీది. 
– ఇప్పుడు పోటీ చేస్తున్న 21 స్థానాల్లో కూడా మీ పార్టీ అభ్యర్థులను పెట్టుకోలేని మీరు జగన్‌ గారి గురించి మాట్లాడతారా? 
– ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఇలాంటి వ్యక్తిగత దూషణలకు దిగితే ప్రజలు ఛీ కొడతారన్న విషయం తెలుసుకోండి. 

నడిరోడ్డుపై గన్‌ పట్టుకుని వీరంగం వేసిన వారిని రౌడీ, క్రిమినల్‌ అంటారు:
– ఇంకా జగన్‌ గారిని పట్టుకుని రౌడీ, క్రిమినల్‌ అంటూ మాట్లాడుతున్నారు. 
– అసలు నడిరోడ్డుపై గన్‌ పట్టుకుని వీరంగం వేసింది మీరు కాదా పవన్‌ కల్యాణ్‌? 
– మీరు పార్టీ పెట్టిన తర్వాత ఈ పదేళ్లలో జగన్‌ గారు కనీసం మీ పేరు కూడా ఎత్తలేదంటూ మీ స్థాయి ఏంటో గుర్తుచేసుకోండి.
– జగనన్న క్రిమినల్‌ కాదు...హిస్టరీ క్రియేటర్‌ అనేది మీరు గుర్తుంచుకోండి.
– 37 ఏళ్లకే కేంద్రాన్నే ఢీకొట్టిన దమ్మున్న నాయకుడు మా జగనన్న. 
– ఒంటి చేత్తో 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లు గెలిచిన క్రియేటర్‌ జగన్‌ గారు.
– 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించిన నాయకుడు మా జగనన్న. 
– 1971 తర్వాత 51 శాతం ఓట్లను సాధించి క్రియేటర్‌గా నిలిచిన నేత మా జగనన్న.
– 86 శాతం సీట్లు సాధించిన క్రియేటర్‌ మా జగనన్న. 
– ఏపీని ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజనెస్‌లో వరుసగా మొదటి స్థానంలో నిలిపిన ముఖ్యమంత్రి మా జగనన్న. 
– ఏపీని గ్రోత్‌ రేట్‌లో దేశంలోనే నంబర్‌ వన్‌గా నాయకుడు మా జగనన్న.
 – అలాంటి జగనన్న గురించి మీరు అవాకులు చెవాకులు పేలుతుంటే జనం నవ్వుకుంటున్నారు. 

నీ రాజకీయ జీవితంలో నీకంటూ ఓ పేజీ ఉందా పవన్‌ కల్యాణ్‌?:
– మీ రాజకీయ జీవితంలో మీకంటూ ఒక పేజీ లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్‌ కల్యాణే. 
– జగనన్న అందర్ని కూర్చోబెట్టి ఆడిస్తున్నాడని పవన్‌ విమర్శిస్తున్నారు.
– అసలు చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా ఆడుతున్నది పవన్‌ కల్యాణే అన్నది రాష్ట్రమంతా తెలుసు.
– చంద్రబాబు కాళ్ల వద్ద బానిసలా బతుకుతున్నది మీరు పవన్‌ కల్యాణ్‌.
– జగన్‌ గారు ఎవర్ని ఆడించారో చెప్పాలి. మీకు జగన్‌ గారి గురించి మాట్లాడే అర్హత ఉందా? 
– విశాఖపట్నం, ఉత్తరాంధ్రలో జగన్‌ గారు ఆస్తులు లాగేసుకుంటున్నారని విమర్శిస్తున్నారు. 
– విశాఖలో ఆస్తులు లాగేసుకుంటున్న దండుపాళ్యం బ్యాచ్‌ టీడీపీ వారే. దానికి నాయకుడు చంద్రబాబే. 
– నిన్నటి మీటింగులో మీ పక్కన నిలబెట్టుకున్న గీతం భరత్‌ 40 ఎకరాలు కబ్జా చేశాడు. 
– మీరు అలాంటి వారిని పక్కనపెట్టుకుని మామీద బురదజల్లుతుంటే విశాఖ ప్రజలు నవ్వుకుంటున్నారు. 
– గతంలో మీరు గంటా శ్రీనివాసరావు, లోకేశ్, చంద్రబాబునాయుడులు అవినీతిపరులు అన్నది మర్చిపోయారేమో కానీ విశాఖ ప్రజలు మర్చిపోలేదు.
– అలాంటి వాళ్లకు మీరు మద్దతు ఇస్తూ తిరిగి మాపై మాట్లాడటం సిగ్గుచేటు.
– విశాఖలో రూ.5వేల కోట్ల విలువైన భూమిని మీ టీడీపీ వాళ్లు కబ్జా చేస్తే దాన్ని వెనక్కి ప్రభుత్వానికి తీసుకొచ్చింది మా జగనన్న. 
– ఆడపిల్లల జోలికి వచ్చినా, కబ్జాలు చేసినా మోకాళ్ల విరగ్గొట్టి జగదాంబ సెంటర్లో కూర్చోబెడతా అంటున్న పవన్‌ కల్యాణ్‌ మరి 40 ఎకరాలు కబ్జా చేసిన టీడీపీ వారిని అలా ఎందుకు కూర్చోబెట్టలేదు?
– భూములు కబ్జా చేసిన గీతం భరత్‌ని ఎప్పుడు మీరు మోకాళ్లు విరగ్గొట్టి కూర్చోబెట్టబోతున్నారు? 
– బండారు సత్యనారాయణ అనుచరులు ఓ గిరిజన మహిళను వివస్త్రను చేశారు.
– అలాంటి వారికి కొమ్ముకాస్తున్న బండారు సత్యనారాయణమూర్తిని మీరు ఎప్పుడు జగదాంబ సెంటర్లో మోకాళ్లపై కూర్చోబెడతారు?
– గంటా శ్రీనివాసరావు భూకబ్జాలు చేశాడని మీ నోటితో మీరే అన్నారు. మరి అతన్ని ఎప్పుడు మొకాళ్లు విరగ్గొట్టి జగదాంబ సెంటర్లో కూర్చోబెతున్నారు? 
– మీ కూటమి పాయకరావుపేట అభ్యర్థి అనిత ప్రభుత్వ భూమినే ప్రభుత్వానికి అమ్మేసింది. ఆమెను ఎప్పుడు తీసుకొచ్చి జగదాంబ సెంటర్లో నిల్చోబెడుతున్నారో చెప్తే బాగుంటుంది.
– రూ.5,700 కోట్లు బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టిన సుజనాచౌదరి లాంటి వ్యక్తికి మీ జనసేన సీటును అమ్ముకున్నారు.
– అలాంటి వారితో అంటకాగుతూ మీరు మాపై బురదజల్లితే నమ్మడానికి విశాఖ ప్రజలు ఎలా కనిపిస్తున్నారు? 

కడప నుంచి కబ్జాదారులను అభ్యర్థిగా తెచ్చింది మీ కూటమే పవన్‌:
– వైఎస్సార్సీపీని గెలిపిస్తే కడప రౌడీలు, గూండాలు వచ్చేస్తారట.
– అయ్యా పవన్‌ కల్యాణ్‌...ఇక్కడ పోటీ చేస్తున్న మా అభ్యర్థులంతా లోకల్‌.
– మీరే అనకాపల్లిలో ఈడీ కేసుల్లో ఉన్న, భూకబ్జాలు చేసిన వ్యక్తిని కడప నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారన్నది మర్చిపోవద్దు. 
– అలాంటి అభ్యర్థులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మమ్మల్ని విమర్శిస్తే ప్రజలు ఎలా నమ్ముతారని అనుకుంటున్నారు?
– వంగవీటి మోహనరంగా గారిని హత్య కేసులో నిందితుడిగా ఉన్న  వెలగపూడి రామకృష్ణను మీరు అభ్యర్థులుగా పెట్టి మాపై విమర్శలు చేయడం విడ్డూరం.
– విప్లవ స్ఫూర్తిని గుండెల్లో నింపుకున్నాను అంటున్నారు. చేగువీరా పేరు చెబితే నేను గుర్తుకురావాలి అన్నట్లు మాట్లాడుతున్నారు.
– అసలు మీరు నిజంగా చెగువీరా స్ఫూర్తితో ఉన్న వారైతే బీజేపీతో మీరు పొత్తు పెట్టుకుంటారా?
– గద్దర్‌ నాకు స్ఫూర్తి..అతనంటే నాకు చాలా ఇష్టం అంటారు. 
– అలాంటి గద్దరన్న గుండెల్లో బుల్లెట్లు దింపిన చంద్రబాబుతో మీరు పొత్తు పెట్టుకున్నారంటే మిమ్మల్ని ఏమనాలి?
– మీ మాటలకి, చేతలకి పొంతన ఉండదా? ప్రజల్ని మభ్యపెట్టడానికి ఏది చెప్పినా ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నారా?
– నిన్న విశాఖ వచ్చిన మీరు విశాఖ స్టీల్స్‌ గురించి ఎందుకు మాట్లాడలేదు? 
– ప్రైవేటకరణను వెనక్కి తీసుకోమని మీరు మోడీ గారికి చెప్పాలి కదా?
– రైల్వే జోన్‌ ఇవ్వమని మోడీ గారికి చెప్పాలి కదా?
– అదేమంటే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ గురించి మాట్లాడుతున్నారు.
– మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు..మోడీ గారు రేపు ఎల్లుండో ఏపీకి వస్తారని తెలిసింది.
– మీకు నిజంగా దమ్ముంటే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ మేం పెట్టలేదు అని మోడీగారితో చెప్పించగలరా?
– లేదా ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు మేం వ్యతిరేకం అని మోడీ గారితో చెప్పింగలరా?
– రేపు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం వస్తే ఈ యాక్ట్‌ అమలు చేయమని చెప్పించగలరా?
– విశాఖలో శాంతిభద్రతలు లేవంటాడు. మీ కూటమి ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యే హత్య జరిగింది?
– మీ కూటమి ప్రభుత్వంలోనే వనజాక్షి అనే మహిళను జుట్టుపట్టుకుని ఈడ్చి కొట్టారు.
– మీ ప్రభుత్వంలో ఎన్నో సంఘటనలు జరిగితే అప్పుడెందుకు మీరు మాట్లాడలేదు? 
– ప్రతి స్పీచ్‌లో జగనన్నను తొక్కుతాను అంటున్నాడు. మీరు తొక్కడానికి ఇదేమన్నా సైకిల్‌ అనుకుంటున్నారా? 
– జగనన్నను తొక్కడం అంత ఈజీ అనుకుంటున్నావా? చంద్రబాబు, సోనియాగాంధీలకే సాధ్యం కాలేదు.
– జగనన్నను తొక్కాలనుకునే ఆలోచన పెట్టుకుంటేనే ప్రజలు తొక్కి నారతీస్తారని గమనించాలి.
– 2019లో మీరు జగన్‌ గారిని ఓడిస్తానంటూ శపథం చేశారు. ఆ శపథం ఏమైందో ప్రజలంతా చూశారు.
– ఇలాంటి మాటలు మానేసి గౌరవంగా మాట్లాడితే బాగుంటుంది.
– మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో మీరేం చేశారో ప్రజలకు చెప్పి ఓట్లడగండి. 
– అప్పుడు ఏమీ చేయలేదు కాబట్టే ఇలాంటి తిట్లు, శాపనార్ధాలు పెడుతున్నాడు.
– ఇలాంటి పరిస్థితే కొనసాగితే ప్రజలు మిమ్మల్ని కచ్చితంగా తగిన బుద్ధి చెప్తారు.
– ఇలాంటి తప్పుడు మాటలు, ఆలోచనలు మానుకోవాలని విన్నవిస్తున్నా.
– మరో పది రోజుల్లో జగనన్నే మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. దాన్ని చూడ్డానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉండాలని కోరుతున్నా.

Back to Top