తాడేపల్లి: తిరుమల వెంకటేశ్వరస్వామి జోలికి వెళ్లొద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వైయస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు గురువారం విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. చంద్రబాబు! “తిరుమల జోలికి వెళ్లొద్దు" మీ కుళ్లురాజకీయాలకు దేవుడిని వాడుకోవద్దు. హిందుమనోభావాలు దెబ్బతీస్తే నాశనమైపోతారు! అంటూ విజయసాయిరెడ్డి తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. కాగా, తిరుమల లడ్డూ ప్రసాదంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయా? అంటూ సూటిగా ప్రశ్నించిన సుప్రీం కోర్టు.. లడ్డూ శాంపిల్‌ను ముందుగానే ఎందుకు పరీక్షల కోసం పంపలేదని నిలదీసింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం సెప్టెంబర్ 30న విచారణ జరిపింది. ల్యాబ్ మీ వద్ద ఆధారాలు ఉన్నాయా? నెయ్యిని రిజెక్ట్ చేశారని ఈవో చెప్పారు కదా?. నెయ్యి రిజెక్ట్ చేశాక వాడే పరిస్థితి ఉండదు కదా?. ఇదంతా పబ్లిక్ డొమైన్‌లో ఉంది కదా?. జులైలో రిపోర్ట్ వస్తే.. సెప్టెంబర్‌లో చెప్పారెందుకు?. ఎన్‌డీడీబీ మాత్రమే ఎందుకు?. మైసూర్ లేదంటే గజియాబాద్ ల్యాబ్‌ల నుంచి సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు?. కల్తీ నెయ్యిని లడ్డూలో వాడిట్లు ఆధారాల్లేవ్. లడ్డూ కల్తీ జరిగిందని తేల్చేందుకు శాంపిల్‌ను ల్యాబ్‌కు పంపించారా? అని టీటీడీ లాయర్ సిదార్థ్ లూథ్రాను ప్రశ్నించింది.