వైయస్ఆర్ జిల్లా : వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఉన్న చరిష్మా దేశంలో ఎవరికీ లేదన్నారు పార్టీ వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి. స్వయంకృషితో పార్టీ స్థాపించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన విషయాన్ని రవీంద్రనాథ్‌రెడ్డి గుర్తుచేశారు. నాలుగురోజుల పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ జిల్లాకు వచ్చారని, ఆయనను చూసేందుకు ప్రతిరోజూ తెల్లవారు జాము నుంచే ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారన్నారు. వైఎస్ జగన్‌కు వస్తున్న ప్రజాదారణ చూసి జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తున్నారని రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. వైయస్ జగన్ ఇంటిపై రాళ్ల దాడి అని ప్రసారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైయస్ జగన్‌ను చూసేందుకు తండోపతండాలుగా జనం తరలివస్తుంటే, దానిపై కూడా ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాయడం నిజంగా సిగ్గుచేటన్రారు. ప్రస్తుతం రాష్ట్రంలో దరిద్రమైన పాలన కొనసాగుతోందని రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు.