తండ్రి పెట్టిన పార్టీపై ప్రేమ.. మరిది కళ్ళలో ఆనందమే టార్గెట్!

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌

న్యూఢిల్లీ: ఏపీ బీజేపీ చీఫ్‌ దగ్గుబాటి పురంధేశ్వరికి వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పొలిటికల్‌ కౌంటరిచ్చారు. బీజేపీ అంటే బాబు జనతా పార్టీ కాదు అంటూ ఎద్దేవా చేశారు. మీ నాన్నాగారు(ఎన్టీఆర్‌) మహానటులు.. మీరు(పురంధేశ్వరి) కాదనుకున్నాం అంటూ పొలిటికల్‌ పంచ్‌ ఇచ్చారు. 

‘అమ్మా, పురందేశ్వరిగారు.. బీజేపీ అంటే “బాబు జనతా పార్టీ” కాదు! బాబుది స్క్రిప్ట్‌.. వదినది డైలాగ్‌! తండ్రి పెట్టిన పార్టీపై ప్రేమ.. మరిది కళ్ళలో ఆనందమే టార్గెట్!. మీ నాన్నగారు మహానటులు.. మీరు కాదనుకున్నాం. పార్లమెంటులో ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టినప్పుడు సోనియాకు ధన్యవాదాలు పలికిన మీరు అదే ఉత్సాహంతో ఇప్పుడు బీజేపీలో జీవిస్తున్నారంటే మీ నటనాకౌశలాన్ని అభినందించాల్సిందే!’ అంటూ కామెంట్స్‌ పెట్టారు.  

Back to Top